ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో ఎన్కౌంటర్...ఏరియా క‌మిటీ స‌భ్యుడు సహా మహిళా మావోయిస్ట్ మృతి

Arun Kumar P   | Asianet News
Published : Dec 13, 2020, 11:38 AM ISTUpdated : Dec 13, 2020, 11:45 AM IST
ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో ఎన్కౌంటర్...ఏరియా క‌మిటీ స‌భ్యుడు సహా మహిళా మావోయిస్ట్ మృతి

సారాంశం

ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 

ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దులో మావోయిస్టులు, పోలీసుల‌కు మ‌ద్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఏవోబీలో క‌టాఫ్ ఏరియా ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులు కాల్పులకు దిగగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించారు. 

ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ఏరియా క‌మిటీ స‌భ్యుడు మ‌ల్ల‌న్నగా గుర్తించారు.  మ‌రొక మ‌హిళా మావోయిస్ట్ కూడా ఈ కాల్పుల్లో మరణించింది. ఆమె వివరాలు గుర్తించాల్సి ఉంది.  

ఒడిశా కు చెందిన ఎస్‌వోజీ మ‌రియు డీవీఎఫ్ బ‌ల‌గాలు క‌టాఫ్ ఏరియా ప్రాంతంలోని ఎగ‌జ‌న‌భ స‌మీపంలో సింగారం అట‌వీప్రాంతంలో మావోయిస్టులు ముఖ్య‌మైన స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్టు భద్రతా బలగాలకు ముందుగా స‌మాచారం అందింది. దీంతో గాలింపు చ‌ర్య‌లు  నిర్వ‌హించ‌గా ఆదివారం తెల్ల‌వారుజామున వారికి మావోలు ఎదురుపడ్డారు. దీంతో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం