ప్రమాదకరంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి: డాక్టర్ వెల్లడి

By Arun Kumar PFirst Published Dec 13, 2020, 9:01 AM IST
Highlights

ప్రస్తుతం రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మేడికల్ సైన్సెస్(రిమ్స్)లో లాలూ ప్రసాద్ యాదవ్  చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి ఆరోగ్య పరిస్థితి గురించిన రిమ్స్ వైద్యులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు డాక్టర్ ఉమేష్ చంద్ర. 

రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు వైద్యం అందిస్తున్న ఫిజిషియన్ డాక్టర్ ఉమేష్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం  జైలులో ఉన్న  లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని... భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోవచ్చని అన్నారు. 

ప్రస్తుతం రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో లాలూ ప్రసాద్ యాదవ్  చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి ఆరోగ్య పరిస్థితి గురించిన రిమ్స్ వైద్యులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు డాక్టర్ ఉమేష్ చంద్ర. 

''నేనే ఇప్పుడే కాదు గతంలో కూడా లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాను. ఆయన కిడ్నీలు కేవలం 25 శాతం పనిచేస్తున్నాయని... భవిష్యత్ లో ఇది మరింత దిగజారే ప్రమాదం వుంది. అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఆ ప్రమాదం పొంచివుందో చెప్పడం కష్టం'' అన్నారు డాక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. 

''లాలూ ప్రసాద్ గత 20ఏళ్లుగా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీంతో మెళ్లిగా ఆయన కిడ్నీలు పాడవడం ప్రారంభమయ్యింది. ఈ విషయానే రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ డాక్టర్లకు తెలియజేశారు'' అని డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు. 
 

click me!