ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

By telugu teamFirst Published Jun 14, 2019, 10:46 AM IST
Highlights

 తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు 40 నిమిషాల పాటు కాల్పులు జరుగాయి.

కొత్తగూడెం: చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో తుపాకుల మోత మోగింది. మావోయిస్టులకు, భద్రతబలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో డీఆర్జీ భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 

ఈ క్రమంలో తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు 40 నిమిషాల పాటు కాల్పులు జరుగాయి. క్రమంగా మావోయిస్టు అక్కడి నుంచి తప్పించుకున్నారు. 

కాల్పుల విరమణ అనంతరం భద్రతా బలగాలు సంఘటన స్థలంలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. సంఘటనా స్థలంలో ఒక 303రైఫిల్, ఒక 301 బోర్ తుపాకి, మరో రెండు ఆయుధాలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. 

ఈ ఘనపై కాంకేర్ ఎస్పీ కే.ఎల్. ధృవ్ స్పష్టత ఇచ్చారు. గురువారం తెల్లవా జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

click me!