
అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో వరదల వల్ల మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తంగా ఈ ఏడాది వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 30కి చేరిందని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) శుక్రవారం తెలిపింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నాగావ్, కాచర్, మోరిగావ్, డిమా హసావో, గోల్‌పరా, గోలాఘాట్, హైలకండి, హోజాయ్, కమ్‌రూప్, కమ్రూప్ (మెట్రో), కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, సోనిత్‌పూర్ - 12 జిల్లాల్లోని దాదాపు 5.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అథారిటీ తెలిపింది.
Char Dham Yatra: చార్ ధామ్ యాత్రలో ఇప్పటివరకు 91 మంది మృతి
గడిచిన 24 గంటల్లో వరద నీటిలో మునిగి మరణించిన ఇద్దరు నాగావ్ జిల్లాకు చెందిన వారని అధికార యంత్రాంగం పేర్కొంది. తాజా బులిటెన్ ప్రకారం ఈ జిల్లాలో 3.68 లక్షల మందికి పైగా వరదల వల ప్రభావితం అయ్యారు. అలాగే కాచర్ లో దాదాపు 1.5 లక్షల మంది, మోరిగావ్ లో 41,000 మందికి వరదల దాటికి గురయ్యారు.
మొఘల్స్ ధ్వంసం చేసిన 36,000 ఆలయాలను బీజేపీ పునరుద్ధరిస్తుంది - కర్ణాటక మాజీ మంత్రి కె.ఈశ్వరప్ప
కాగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT) రాష్ట్రానికి చేరుకుంది. ముందస్తు వరదలు, కొండచరియలు అస్సాంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 47,139.12 హెక్టార్లలో పంట నష్టం జరిగింది.
వరదల వల్ల నష్టపోయిన ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం 295 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారందరినీ సహాయ శిబిరాలకు తరలించారు. అయితే కేంద్ర బృందం కాచర్, డిమా హసావో, దర్రాంగ్, నాగావ్, హోజాయ్‌లను సందర్శించనుంది. అయితే అస్సాం వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి మే 25న కేంద్రం రూ.324 కోట్ల అడ్వాన్స్‌ను విడుదల చేసింది.