అసోం: రణరంగమైన ఇళ్ల కూల్చివేత.. పోలీసులపై తిరగబడ్డ స్థానికులు, కాల్పుల్లో ఇద్దరి మృతి

By Siva KodatiFirst Published Sep 23, 2021, 7:31 PM IST
Highlights

అసోంలో ఇళ్ల కూల్చివేత రణరంగంగా మారింది. దరంగ్ జిల్లా ధోల్పూర్‌లో ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. అక్కడికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులపైకి దూసుకొచ్చిన వ్యక్తిపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. 

అసోంలో ఇళ్ల కూల్చివేత రణరంగంగా మారింది. దరంగ్ జిల్లా ధోల్పూర్‌లో ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. అక్కడికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులపైకి దూసుకొచ్చిన వ్యక్తిపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. తొలుత అతణ్ణి చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు పోలీసులు. అనంతరం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ధోల్పూర్ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించిన ప్రభుత్వం.. పోలీసు బలగాల సాయంతో కూల్చివేతను చేపట్టింది. దీంతో 800 మంది స్థానికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా వుంటామని హామీ ఇచ్చారు. 

click me!