ఉద్దేశపూర్వకంగానే ఝార్ఖండ్ జడ్జిపై దాడి !

By AN TeluguFirst Published Sep 23, 2021, 4:57 PM IST
Highlights

న్యాయమూర్తి హత్యకేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ప్రత్యేకంగా నాలుగు ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆధారాలను విశ్లేషించిన గాంధీనగర్. ఢిల్లీ, ముంబయికి చెందిన ఫోరెన్సిక్ బృందాలు.. న్యాయమూర్తి మీద ఉద్దేశపూర్వకంగానే దాడి జరిపారనే నిర్థారణ వచ్చినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఝార్ఖండ్లో జిల్లా జడ్జిని (Jharkhand High Court judge)ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఉద్దేశపూర్వకంగానే(intentionally hit) న్యాయమూర్తి మీద దాడి జరిగినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పేర్కొంది. ఘటన పునర్మినర్మాణం, సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన, 3డీ విశ్లేషణలతో పాటు ఫోరెన్సిక్ నివేదికలను బట్టి న్యాయమూర్తిని(Dhanbad judge) ఉద్దేశపూర్వకంగానే హత్య చేసేందుకు ఆటోతో దాడి చేశారని తెలిపింది. కేసు దర్యాప్తుకు సంబంధించి ఇప్పటివరకు సేకరించి ఝార్ఖండ్ హై కోర్టుకు సీబీఐ మధ్యంతర నివేదికను అందించింది. 

న్యాయమూర్తి హత్యకేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ప్రత్యేకంగా నాలుగు ఫోరెన్సిక్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆధారాలను విశ్లేషించిన గాంధీనగర్. ఢిల్లీ, ముంబయికి చెందిన ఫోరెన్సిక్ బృందాలు.. న్యాయమూర్తి మీద ఉద్దేశపూర్వకంగానే దాడి జరిపారనే నిర్థారణ వచ్చినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలిసిస్ పరీక్షల ఫలితాలను కూడా సీబీఐ విశ్లేషిస్తోంది. ఈ హత్యకు సంబంధించి కుట్ర కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ, కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించింది. 

అన్ని ఆధారాలను దృవీకరించుకుని త్వరలోనే ఈ కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని ఝార్ఖండ్ హైకోర్టుకు ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే, ధన్ బాద్ జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఇద్దరు వ్యక్తులు ఆటోతో ఢీ కొట్టి హత్య చేశారు. 

మహారాష్ట్రలో దారుణం: మైనర్‌పై 29 మంది 9 నెలలుగా రేప్

అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసును ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా సీబీఐ ద్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని ఝార్ఖండ్ ప్రభుత్వం సీబీఐకి తెలపింది. ఈ కేసులో ఆటో డ్రైవర్ లఖాన్ వర్మ, అతనికి సహాయం చేసిన రాహుల్ వర్మలను ప్రధాన నిందితులుగా గుర్తించిన సీబీఐ దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
 

click me!