జమ్మూకాశ్మీర్ : పుల్వామాలో ఎన్​కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

By Siva KodatiFirst Published Dec 1, 2021, 4:11 PM IST
Highlights

జమ్మూకశ్మీర్‌‌లోని (jammu and kashmir) పుల్వామా (pulwama encounter) మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు (terrorists) బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మృతుల్లో జైష్​-ఏ-మహమ్మద్(జేఈహెచ్​) (jaishe mohammed) ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​కుమార్ (vijay kumar ips) తెలిపారు. 

జమ్మూకశ్మీర్‌‌లోని (jammu and kashmir) పుల్వామా (pulwama encounter) మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు (terrorists) బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.  ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిని గమనించిన టెర్రరిస్టులు ఫైరింగ్‌ జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కూడా కాల్పులకు దిగడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రవాదుల కదలికలతో సైన్యం అప్రమత్తమైంది. స్థానిక ప్రజలను అలర్ట్‌ చేసింది. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నారు. దీంతో ఉగ్రవాదులు దాగి ఉన్నారేమోనని అణువణువూ గాలిస్తున్నారు. 

Also Read:కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ కమాండర్ సహా ఐదుగురు హతం.. అరగంట తేడాతో రెండు ఎన్‌కౌంటర్లు

మృతుల్లో జైష్​-ఏ-మహమ్మద్(జేఈహెచ్​) (jaishe mohammed) ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​కుమార్ (vijay kumar ips) తెలిపారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడని ఆయన వెల్లడించారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగాయి. దీంతో సీఆర్ఫీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీస్ బలగాలు ఉమ్మడిగా ఏరివేతకు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ  క్రమంలోనే గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ (lashkar e taiba) అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫోర్స్‌కు (the resistance force) సంబంధించిన ముష్కరులు హతమయ్యారు.

click me!