Goods Trains Derail: గూడ్స్ రైళ్ల ఢీ.. బోల్తా ప‌డ్డ 18 వ్యాగ‌న్లు..

Published : Mar 29, 2022, 04:49 AM IST
Goods Trains Derail: గూడ్స్ రైళ్ల ఢీ.. బోల్తా ప‌డ్డ 18 వ్యాగ‌న్లు..

సారాంశం

Goods Trains Derail: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా జామ్‌గావ్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో నిలిచిపోయిన సరుకు రవాణా రైలును గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 18 వ్యాగన్లు పట్టాలు త‌ప్పాయి. దీంతో కీలకమైన హౌరా-ముంబై మార్గంలో సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.  

Goods Trains Derail: ఆగి ఉన్న గూడ్స్ రైలును మ‌రో గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో ఇరు రైళ్ల‌కు చెందిన 18 వ్యాగన్లు పట్టాలు త‌ప్పాయి. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప‌లు రైళ్ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. ఈ  ఘ‌ట‌న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. జామ్‌గావ్ రైల్వే స్టేషన్ యార్డ్‌లో సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో యార్డ్‌లో నిలిచిన ఉన్న‌ గూడ్స్ రైలును అకస్మాత్తుగా మరో గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టింది.దీంతో రెండు రైళ్లకు చెందిన మొత్తం 18 వ్యాగన్‌లు ట్రాక్‌పై ప‌డిపోయాయి. దీంతో రద్దీగా ఉండే హౌరా-ముంబై మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని రైల్వే అధికారులు తెలిపారు.  అయితే ఎలాంటి గాయాలు కాలేదు. 

ఈ విష‌యం తెలుసుకున్న‌బిలాస్‌పూర్ రైలు డివిజన్‌కు చెందిన రైల్వే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ పునరుద్ధరణ పనులు వేగ‌వంతంగా జరుగుతున్నాయని బిలాస్‌పూర్‌లోని ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుందని అధికారి తెలిపారు. పట్టాలు తప్పిన కారణంగా రెండు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా,  ఆరు రైళ్ల రూట్ల‌ను రిషెడ్యూల్ చేసిన‌ట్టు ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !