Gold Smuggling: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువ తెలిస్తే షాకే..!

Published : Mar 29, 2022, 02:53 AM IST
Gold Smuggling: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువ తెలిస్తే షాకే..!

సారాంశం

Gold Smuggling:  ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కెన్యాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి ₹ 7.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం సుంకం విలువ సుమారు ₹ 7.5 కోట్లు ఉంటుందని అధికారి తెలిపారు.  

Gold Smuggling:  కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి దొడ్డి దారిన బంగారాన్ని తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కస్టమ్స్ అధికారులు అసలు తమను గుర్తించలేరని బంగారాన్ని ఎక్కడెక్కడో దాచి అక్రమంగా తరలిస్తుంటారు. కానీ చివరకు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అడ్డంగా బుక్కవక తప్పదు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. 

తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్జాతీయ  ప్రయాణికుల నుంచి  ₹ 7.5 కోట్ల విలువైన గోల్డ్ బిస్కెట్లను సీజ్ చేసినట్లు   కస్టమ్స్ అధికారులు తెలిపారు. విదేశీ మార్క్ ఉన్న బంగారు బిస్కెట్ల ఫోటోలను ట్వీట్ చేశారు.

సీజ్ చేసిన బంగారు బిస్కెట్లు 15.57 కిలోల బరువు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు  నైరోబీ నుంచి అడిస్‌ అబాబా మీదుగా ఢిల్లీ చేరుకున్న‌ట్టు పేర్కొన్నారు.సోమవారం ఉదయం నైరోబీ నుంచి అడిస్‌ అబాబా మీదుగా వచ్చిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రత్యేకంగా తయారు చేసిన జేబుల్లో దాచి ఉంచిన మొత్తం 15.57 కిలోల బరువున్న 19 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

ప్రయాణీకులలో ఒకరు గతంలో నాలుగైదు సార్లు భారత్‌కు వెళ్లినట్లు అంగీకరించారని, ప్రతి సందర్భంలోనూ బంగారం తీసుకెళ్లినట్లు అంగీకరించారని తెలిపారు. విచారణ జరుగుతున్నందున వారిని ఇంకా అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు.  ఇటీవలి కాలంలో అతిపెద్ద సీజ్‌లలో ఒకటిగా కస్టమ్స్ అధికారులు  తెలిపారు. కస్టమ్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటికప్పుడు అక్రమంగా బంగారం తరలిస్తూ... పలువురు పట్టుబడుతూనే ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu