బీఎస్ఎఫ్ జవాన్ కు కరోనా: హెడ్ క్వార్టర్ రెండంతస్తులు మూసివేత

By narsimha lodeFirst Published May 4, 2020, 6:17 PM IST
Highlights

  బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్లోని రెండు అంతస్తులను మూసివేశారు. బీఎస్ఎఫ్ లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకిందని  తేలడంతో ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్థులను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.


న్యూఢిల్లీ:  బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్లోని రెండు అంతస్తులను మూసివేశారు. బీఎస్ఎఫ్ లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకిందని  తేలడంతో ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్థులను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

న్యూఢిల్లీలోని లోథి రోడ్డులో సీజీఓ కాంప్లెక్స్ లో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం 8 అంతస్తుల భవనంలో ఉంది. ఇదే కాంప్లెక్స్ సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం కూడ ఉంది.  సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడంతో ఆ కార్యాలయాన్ని కూడ మూసి వేసిన విషయం తెలిసిందే.

also read:కరోనా దెబ్బ: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

బీఎస్ఎఫ్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకడంతో ఈ కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కరోనా సోకిన సిబ్బందితో సన్నిహితంగా ఉన్న వారెవరు అనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకిందని  మే 3వ తేదీ రాత్రిన తేలింది. అతను మే 1వ తేదీన చివరి సారిగా కార్యాలయంలో విధులు నిర్వహించినట్టుగా బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.

అతను బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోని రెండో ఫ్లోర్ లో విధులు నిర్వహించేవాడు. ముందు జాగ్రత్తగా మొదటి, రెండు అంతస్తులను మూసివేస్తున్నట్టుగా బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. బీఎస్ఎఫ్ జవాన్ అనారోగ్య లక్షణాలు కలిగి ఉండడంతో ఆసుపత్రికి పంపితే అసలు విషయం తేలిందని అధికారులు చెప్పారు.

బీఎస్ఎఫ్ కు చెందిన 54 మందికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలోని జామ మసీదు, చాందిని చౌక్ ప్రాంతాల్లో  విధులు నిర్వహించిన వారికి ఈ వైరస్ సోకింది.సుమారు రెండున్నర లక్షల మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

click me!