కరోనాను పురస్కరించుకొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు-2020 వాయిదా వేసింది యూపీఎస్‌సీ. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మే 20వ తేదీన ప్రకటించనున్నట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: కరోనాను పురస్కరించుకొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు-2020 వాయిదా వేసింది యూపీఎస్‌సీ. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మే 20వ తేదీన ప్రకటించనున్నట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది.
ఈ నెల 31వ తేదీన యూపీఎస్‌సీ 2020 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్లను జారీ చేయనున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు వందలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి అభ్యర్థులు కూడ ఢిల్లీలో ఉన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కాంపిటిటీవ్ పరీక్షలను వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ వాయిదా వేసిన పరీక్షలను రద్దు చేసింది.
also read:కరోనా చికిత్స: ఒక్కో రోగిపై రోజూ రూ. 25 వేల ఖర్చు
లాక్ డౌన్ నేపథ్యంలో ఈ పరీక్షల షెడ్యూల్ ను మార్చాలని వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. పరీక్షల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేస్తామని ప్రకటించారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ముందుగానే ప్రారంభమైంది. కానీ కరోనా దెబ్బకు పరీక్షల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది.