కేరళ ఏనుగు ఘటన మరవకముందే: ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఏనుగులు మృతి.. ఒకటి 20 నెలల గర్భవతి

Siva Kodati |  
Published : Jun 11, 2020, 02:26 PM IST
కేరళ ఏనుగు ఘటన మరవకముందే: ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఏనుగులు మృతి.. ఒకటి 20 నెలల గర్భవతి

సారాంశం

కేరళలో గ్రామస్తుల అటవిక చర్యల కారణంగా గర్భంతో ఉన్న ఓ ఏనుగు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులను కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన మరవకముందే ఛత్తీస్‌గడ్‌లోనూ మరో విషాదం చోటు చేసుకుంది.

కేరళలో గ్రామస్తుల అటవిక చర్యల కారణంగా గర్భంతో ఉన్న ఓ ఏనుగు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులను కంటతడి పెట్టించింది.

ఈ విషాద ఘటన మరవకముందే ఛత్తీస్‌గడ్‌లోనూ మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ప్రతాపూర్ అటవీ ప్రాంతంలో రెండు ఏనుగు మృతదేహాలు లభించినట్లు బుధవారం అటవీ అధికారులు పేర్కొన్నారు.

Also Read:ఆ ఏనుగు అనుకోకుండా పైనాపిల్ తిన్నది..కేంద్ర పర్యావరణ శాఖ

వీటిలో ఒకటి 20 నెలల గర్భంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతాపూర్ అటవీ పరిధిలోని గణేష్ పూర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు ఏనుగుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు వెల్లడించారు.

గర్భంతో ఉన్న ఏనుగు కాలేయ సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలిందని చెప్పారు. మృతదేహాల వద్ద భారీగా మిగతా ఏనుగులు గుమిగూడటంతో మరో ఏనుగు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించలేకపోయామని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:కేరళ సీన్ రిపీట్: గర్భంతో ఉన్న ఆవుకు మేతలో పేలుడు పదార్ధాలు

గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద సంచరిస్తుందని మరో ఏనుగు మృతి కారణాలు మాత్రం తెలియాల్సి వుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చేరింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu