Monkey Fever: కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతి.. ‘48 మందిలో గుర్తించాం’

Published : Feb 05, 2024, 04:47 AM IST
Monkey Fever: కర్ణాటకలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మృతి.. ‘48 మందిలో గుర్తించాం’

సారాంశం

కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేగుతున్నది. తాజాగా, ఇద్దరు వ్యక్తులు ఈ మంకీ ఫీవర్ కారణంగా మరణించారు.  

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు మరణించారు. శివమొగ్గ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి, ఉడిపి జిల్లాకు చెందిన 79 ఏళ్ల వృద్ధుడు ఈ మంకీ ఫీవర్ కారణంగా మరణించారు.  ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు రిపోర్ట్ అయినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ తెలిపారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2288 శాంపిళ్లను అధికారులు సేకరించారు. ఈ శాంపిళ్లను పరీక్షించగా అందులో 48 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్టు గుర్తించారు. మంకీ ఫీవర్ కోతుల నుంచి మనుషులకు సోకుతుంది.

Also Read: Hyderabad: జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు!

కోతులను కరిచే కీటకాలు మనిషినీ కరిస్తే ఆ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తాయని రణదీప్ వివరించారు. ఈ మంకీ ఫీవర్‌కు ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని తెలిపారు. టీకా కోసం ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్