మటన్ సూప్‌లో రైస్.. వెయిటర్‌ను చంపేసిన ఇద్దరు కస్టమర్లు

Published : Nov 17, 2022, 12:28 AM IST
మటన్ సూప్‌లో రైస్.. వెయిటర్‌ను చంపేసిన ఇద్దరు కస్టమర్లు

సారాంశం

మహారాష్ట్రలో ఇద్దరు కస్టమర్లు ఓ హటల్‌కు వెళ్లారు. అక్కడ సరైన సర్వీస్ చేయలేదని వెయిటర్‌ను తలపై బలంగా కొట్టారు. దీంతో వెయిటర్ మరణించాడు. మటన్ సూప్‌లో వారికి రైస్ కనిపించిందని సీరియస్ అయ్యారు.  

పూణె: మహారాష్ట్రలో ఇద్దరు కస్టమర్లు హోటల్లో వెయిటర్‌ను చంపేసిన ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ క్వాలిటీపై గొడవ మొదలైనట్టు తెలుస్తున్నది. మటన్ సూప్‌లో రైస్ కూడా కనిపించడంతో కస్టమర్లు.. టీనేజీ వెయిటర్‌ను గద్దించారు. ఆ తర్వాత వెయిటర్ పై దాడి చేశారు. దీంతో వెయిటర్ మరణించాడు. ఆ ఇద్దరు కస్టమర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

పూణెలోని పింపుల్ సౌదాగర్‌లో ఈ ఘటన జరిగినట్టు బుధవారం పోలీసులు వివరించారు. సౌదాగర్ ఏరియాలోని ఓ హోటల్‌లో మంగేష్ పోస్తె అనే టీనేజీ అబ్బాయి వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఆ హోటల్‌కు విజయ్ వాఘిరే, మరొక వ్యక్తి వచ్చారు. వారికి మంగేష్ పోస్తె సర్వ్ చేశాడు. అయితే, మటన్ సూప్‌లో రైస్ కనిపించిందని కస్టమర్లు సీరియస్ అయ్యారు. ఆ కస్టమర్లు హోటల్ ఎంప్లాయీస్ పై దాడి చేయడం మొదలు పెట్టారు. మంగేష్ పోస్తె తలపై బలంగా కొట్టడంతో వెయిటర్ మరణించినట్టు అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ దిలీప్ పవార్ వివరించారు.

Also Read: కేరళ మర్డర్ కేసులో ట్విస్ట్ : పెళ్లైతే చనిపోతాడని జోస్యం... ప్రియుడికి కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చి హత్య..

నిందితులు అప్పుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు నిందితుల్లో ఒకరిని విజయ్ వాఘిరేగా గుర్తించారు. మరొక కస్టమర్‌ను గుర్తించాల్సి ఉన్నది.పోలీసులు మర్డర్ కేసు ఫైల్ చేశారు. వారికోసం గాలింపులు చేపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం