కేంద్రమంత్రికి ఊహించని షాక్.. 13 ఏళ్ల క్రితం నాటి చోరీ కేసులో అరెస్ట్ వారెంట్ .. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? 

By Rajesh KarampooriFirst Published Nov 16, 2022, 9:02 PM IST
Highlights

13 ఏళ్ల క్రితం జరిగిన చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్‌పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. మంత్రితో పాటు మరో నిందితుడిపై కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

బీజేపీ లీడర్, కేంద్రమంత్రికి ఊహించని షాక్ తలిగిలింది. 13 ఏళ్ల క్రితం నాటి చోరీ కేసులో  పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌ జిల్లా కోర్టు కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలీపుర్‌దూర్‌ జిల్లాలోని నగల దుకాణాల్లో చోరీ ఘటనకు సంబంధించిన కేసులో వారెంట్‌ జారీ అయింది.ఈ సంఘటన 2009 నాటిది. తాజాగా హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్‌పై కోర్టు వారెంట్ జారీ చేసింది. అలీపుర్‌దువార్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మూడో కోర్టు కేంద్ర మంత్రిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 2009లో అలీపూర్‌దూర్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు బంగారు దుకాణాల్లో చోరీ కేసు నమోదైందని, ఇందులో కేంద్రమంత్రి ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ 2009 కేసులో నిషిత్ ప్రమాణిక్ నిందితుల్లో ఒకరు. నవంబర్ 11న అలీపుర్‌దువార్ కోర్టులో చివరి విచారణ రోజున ఇతర నిందితుల న్యాయవాదులు హాజరుకాగా, కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ తరపు న్యాయవాది హాజరుకాలేదు.అదే రోజు న్యాయమూర్తి ప్రమాణిక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో మంత్రితో పాటు మరో నిందితుడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.   ప్రమాణిక్ తరపు న్యాయవాది దులాల్ ఘోష్ తదుపరి చర్యల గురించి తెలియజేయలేదు. అరెస్ట్ వారెంట్‌కు సంబంధించి అలీపుర్‌దూర్ ఎస్పీ కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 13 ఏళ్ల క్రితం అలీపుర్‌దూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని బీర్‌పారాలోని ఓ నగల దుకాణంలో జరిగిన దొంగతనానికి సంబంధించి నిందితులు నిందితులుగా మారడం గమనార్హం. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నుంచి అలీపుర్‌దువార్ కోర్టుకు బదిలీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జహర్ మజుందార్  తెలిపారు.


నిషిత్ రాజకీయ ప్రయాణం 

2019లో నిషిత్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ సమక్షంలో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ టికెట్‌పై గెలిచారు.నిషిత్ గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. నిషిత్ కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత పిన్న వయస్కుడైన మంత్రులలో ఒకరు. దీనికి ముందు ప్రమాణిక్ తృణమూల్ కాంగ్రెస్‌లో జిల్లా స్థాయి వ్యవహరాలను చూసుకోనేవాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనపై వేటు వేశారు. 

click me!