మద్యంలో విషం కలుపుకున్న తమ్ముడు... కక్కుర్తితో తాగిన అన్న, ఇద్దరూ మృతి

sivanagaprasad kodati |  
Published : Dec 24, 2018, 12:29 PM IST
మద్యంలో విషం కలుపుకున్న తమ్ముడు... కక్కుర్తితో తాగిన అన్న, ఇద్దరూ మృతి

సారాంశం

ప్రియురాలు దూరమై, ప్రేమ విఫలమైందన్న బాధ తట్టుకోలేక తమ్ముడు మద్యంలో విషం కలుపుకుని తాగి మరణించగా.. అందులో విషయం ఉందన్న సంగతి తెలియక ఆతృతతో దానిని సేవించి అన్న మరణించాడు.

ప్రియురాలు దూరమై, ప్రేమ విఫలమైందన్న బాధ తట్టుకోలేక తమ్ముడు మద్యంలో విషం కలుపుకుని తాగి మరణించగా.. అందులో విషయం ఉందన్న సంగతి తెలియక ఆతృతతో దానిని సేవించి అన్న మరణించాడు.

తమిళనాడు రాష్ట్రం తూత్తుకూడి మణినగర్ పుదూర్‌‌కు చెందిన రాజా, విజయ్ అన్నదమ్ముళ్లు.. రాజాకు ఐదు నెలల క్రితం వివాహమవ్వగా..విజయ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో సదరు యువతి దూరం కావడంతో విజయ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ప్రియురాలు దూరమవ్వడం, తన ప్రేమ విఫలమవ్వడంతో వేదనలో పడ్డ విజయ్ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించాడు.

దీనిలో భాగంగా మద్యంలో విషం కలుపుకుని దానిని సేవించి స్పృహ తప్పాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అన్నయ్య రాజాకు మద్యం కనిపించగానే దానిని సేవించాడు. కాసేపటికి నోట్లో నుంచి నురగలు రావడంతో భయంతో కేకలు పెట్టాడు. అతని అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !