బ్రహ్మపుత్ర నదిలో 100 మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న రెండు పడవలు ఢీ.. పదుల సంఖ్యలో గల్లంతు

By telugu teamFirst Published Sep 8, 2021, 5:49 PM IST
Highlights

అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఎదురెదురుగా వెళ్తుండగా ఢీకొట్టుకున్నాయి. సుమారు వంద మంది ప్రయాణికులను మోసుకెళ్తున్న ఈ పడవలు ఢీకొట్టుకోవడంతో పదుల సంఖ్య ప్రయాణికులు నదిలో గల్లంతయ్యారు. 

గువహతి: ఈశాన్య రాష్ట్రం అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో ఎదురెదురుగా వెళ్తున్న రెండు పడవలు ఢీ కొన్నాయి. ఈ రెండు పడవలు కనీసం వంద మందిని మోసుకెళ్తున్నట్టు సమాచారం. పడవలు ఢీకొట్టుకోవడంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల నదిలో గల్లంతయ్యారు. అసోంలో జోర్హత్ నగరంలో నిమాతి ఘాట్ సమీపంలో(గువహతికి 350 కిలోమీటర్ల దూరంలో) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బ్రహ్మపుత్ర నదిలోని దీవి మజూలీ నుంచి నిమాతి ఘాట్‌వైపు ఒక పడవ వస్తున్నది. కాగా, నిమాతి ఘాట్ వైపు నుంచి మరో పడవ మజూలీకి వెళ్తున్నది. ఈ రెండు ఎదురెదురుగా వెళ్తుండగానే ప్రమాదం జరిగింది. రెండు పడవలు ఢీకొనడంతో చాలా మంది నదిలో మునిగిపోయారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు స్పాట్‌కు చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. 

click me!