అనుమానం : భర్తతో మాట్లాడిందని.. పక్కింటి మహిళను, ఆమె పిల్లల్ని బావిలోకి తోసేసి....

Published : Sep 08, 2021, 04:44 PM IST
అనుమానం : భర్తతో మాట్లాడిందని.. పక్కింటి మహిళను, ఆమె పిల్లల్ని బావిలోకి తోసేసి....

సారాంశం

ఈ ఘటనలో అభం, శుభం తెలియని పిల్లలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో  ఈ ఘటన జరిగింది.  కణ్హే గ్రామానికి చెందిన సంగీత, ఆమె పిల్లలు అన్షు (4), అనన్య (2) మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు.  

భర్తతో పక్కింటి మహిళ మాట్లాడటాన్ని చూసి ఆమె తట్టుకోలేక పోయింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందేమోనని అనుమానం పెంచుకుంది. ఆ అనుమానం పెనుభూతంగా మారింది. ఆ పక్కింటి మహిళతో తరచూ గొడవ పడేది.  మంగళవారం ఆ గొడవ పెద్దదిగా మారింది.  తన భర్తతో మాట్లాడుతున్న మహిళలను, ఆమె పిల్లలను బావిలోకి తోసేసింది. 

ఈ ఘటనలో అభం, శుభం తెలియని పిల్లలు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ ప్రాంతంలో  ఈ ఘటన జరిగింది.  కణ్హే గ్రామానికి చెందిన సంగీత, ఆమె పిల్లలు అన్షు (4), అనన్య (2) మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారు.  

ఆ సమయంలో వారికి అదే గ్రామానికి చెందిన పింకీ అనే మహిళా ఎదురయింది.  ఆమె సంగీతతో వాగ్వాదానికి దిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ  సంగీతను నిందించింది.  ఆ గొడవ రానురాను పెద్దది గా మారింది.  దీంతో ఆగ్రహం చెందిన పింకీ.. సంగీత ఇద్దరు పిల్లలను పక్కనే ఉన్న బావి లోకి తోసేసింది. ఆ తరువాత సంగీతను కూడా బావిలో పడేసింది. తర్వాత అక్కణ్ణుంచి పరారయ్యింది. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport