ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు మృతి, ఒక‌రి ప‌రిస్థితి విష‌మం

Published : Jun 13, 2023, 12:53 PM IST
ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు మృతి, ఒక‌రి ప‌రిస్థితి విష‌మం

సారాంశం

Karimnagar: ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం క‌రీంన‌గ‌ర్ లో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ మ‌రో యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉందని వైద్యులు తెలిపారు.   

Two youngsters killed in road accident in Choppadandi: ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం క‌రీంన‌గ‌ర్ లో చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ మ‌రోయువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. 

వివ‌రాల్లోకెళ్తే.. క‌రీంన‌గ‌ర్ లోని చొప్పదండిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు . ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. చొప్పదండికి చెందిన ముగ్గురు యువకులు బీమానాథిని నవీన్, ఒల్లెపు రాజేష్, ఒల్లెపు సంపత్ ఒక బైక్‌పై, కాట్నపల్లికి చెందిన వేల్పుల మహేష్, పాలకుర్తి చరణ్ మరో బైక్‌పై ప్రయాణిస్తున్నారు.

బైకులు ఢీకొన్న ప్ర‌మాదంలో నవీన్‌(20) అక్కడికక్కడే మృతి చెందగా, మహేశ్‌ కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ‌మ‌ధ్య‌లో తుదిశ్వాస విడిచాడు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ రోడ్డు ప్ర‌మాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..

రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కారు డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోయి లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కు చెందిన జకీర్ అహ్మద్ (60), తబస్సుమ్ (28), హయత్ ఫాతిమాలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నయాజ్ (22), ఇమ్రాన్ ఖాన్ (32), తబ్రీజ్ అహ్మద్ (27), సబా (26) గాయపడి చిత్రదుర్గ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు గోవా నుంచి బెంగళూరు వెళ్తున్నట్లు ఎస్పీ కె.పరశురాం తెలిపారు. కారు డ్రైవర్ అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు