Drugs Seized: మిజోరాంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత.. సబ్బు పెట్టెల్లో..

Published : Jun 05, 2022, 04:12 PM ISTUpdated : Jun 05, 2022, 04:22 PM IST
Drugs Seized:  మిజోరాంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత.. సబ్బు పెట్టెల్లో..

సారాంశం

Drugs Seized: మాదకద్రవ్యాల క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నా.. స్మ‌గ్ల‌ర్ల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. అధికారుల కళ్లు గప్పి విదేశాల నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా.. మిజోరాంలో భారీ మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. లాంగ్లీ జిల్లాలోని సతీక్‌ సమీపంలో  హెరాయిన్‌ తరలిస్తున్న ఇద్దరు స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Drugs Seized: మాదకద్రవ్యాల క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నా.. స్మ‌గ్ల‌ర్ల ఆగ‌డాలు మాత్రం ఆగ‌డం లేదు. అధికారుల కళ్లు గప్పి విదేశాల నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి త‌ర‌లి వ‌స్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ వంటి న‌గ‌రాల్లో డ్రగ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. సెలబ్రిటీల, సంపన్న కుటుంబీకులు చెందిన‌ పిల్లలు, యువ‌త‌కు డ్రగ్స్ చేరవేసి.. కోట్లు దండుకుంటున్నారు. మనదేశంలో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాల ముఠాలే ఇందుకు సాక్ష్యం. అధికారులు ఎంత నిఘా పెట్టినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో వాటిని తీసుకొస్తున్నారు.

తాజాగా.. మిజోరాంలో భారీ మొత్తంలో హెరాయిన్‌ పట్టుబడింది. లాంగ్లీ జిల్లాలోని సతీక్‌ సమీపంలో  హెరాయిన్‌ తరలిస్తున్న ఇద్దరు స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 222 గ్రాముల డ్ర‌గ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంత‌ర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.1.11 కోట్లు ఉంటుందని అధికారులు అంచ‌నా వేశారు. హెరాయిన్‌ను సబ్బు పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారని, మొత్తం 17 సోప్‌ బాక్సులను సీజ్ చేసిన‌ట్టు  తెలిపారు. మిజోరాంలో జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  

జమ్మూ జమ్మూలోని రెండు వేర్వేరు ఘ‌ట‌న‌లో 42 కేజీల గసగసాలు, 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ నుంచి వాహనంలో వస్తున్న ఇద్దరు అనుమానిత వ్యక్తులను జమ్మూ నగర శివార్లలోని ఝజ్జర్ కోట్లి వద్ద ఆపి సోదాలు నిర్వ‌హించ‌గా... వారి నుంచి 42 కిలోల గసగసాలు ఉన్న నాలుగు సంచులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం పోలీసు అధికారులు సమాచారం అందించారు. 

శ్రీనగర్ నుంచి వాహనంలో వస్తున్న ఇద్దరు అనుమానితులను జమ్మూ నగర శివార్లలోని ఝజ్జర్ కోట్లి వద్ద ఆపినట్లు పోలీసు అధికారి తెలిపారు. వారి సోదాల్లో 42 కిలోల గసగసాలు ఉన్న నాలుగు సంచులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌కు చెందిన యోరా, కుల్విందర్‌లను నిందుతులుగా గుర్తించి, అరెస్టు చేశారు. అలాగే మ‌రో ప్రత్యేక బృందం రాజీవ్ నగర్ ప్రాంతంలో బీహార్‌కు చెందిన ధర్వీందర్ కుమార్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజ్‌కుమార్‌లను పట్టుకుని వారి నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 


ఢిల్లీ డ్రగ్ స్మగ్లింగ్.. నైజీరియన్ సహా ముగ్గురు అరెస్ట్, రూ. 21 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
 
ఢిల్లీలో రెండు వేరువేరు కేసుల్లో నైజీరియన్ సహా ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను ఢిల్లీ సైబర్ సెల్ ఆఫ్ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడున్నర కిలోల  హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ.21 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన నిందితులను తిమార్‌పూర్‌కు చెందిన అంకుష్‌, ఉత్తమ్‌నగర్‌కు చెందిన సంజయ్‌, నైజీరియాకు చెందిన ఆంథోనిగా గుర్తించారు.

సైబర్ సెల్ డిప్యూటీ కమిషనర్ కెపిఎస్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి కేసులో పక్కా సమాచారం అందుకున్న అంకుష్‌ను మే 25న కేశవ్ నగర్ సమీపంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న స‌మ‌యంలో అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. అత‌డి నుంచి 505 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అంకుష్ తన తండ్రి అక్రమ మద్యం అమ్మకానికి పాల్పడ్డాడని చెప్పాడు. అంకుష్ తల్లి కూడా ఇంతకు ముందు డ్రగ్స్ అక్రమ రవాణాలో పాల్గొంది. సుల్తాన్‌పురి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న‌ట్టు తెలిపాడు.  

రెండో కేసులో, మే 27న, పక్కా సమాచారం ఆధారంగా.. దబ్రీ మహావీర్ ఎన్‌క్లేవ్‌లోని పవర్ హౌస్ సమీపంలో  నైజీరియాకు చెందిన ఆంథోనీ, సంజయ్‌లను అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆంథోనీ ముఠా సూత్రధారి. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే తన సహచరుల నుంచి ఆంథోనీ డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను విచారిస్తున్న పోలీసులు వారి ఇతర సహచరుల వివరాలను సేకరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !