మనీ లాండరింగ్ కేసు: మహా హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ సహాయకుల అరెస్టు

By telugu teamFirst Published Jun 26, 2021, 8:12 AM IST
Highlights

మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ సహాయకులను అరెస్టు చేశారు. గంటల పాటు ప్రశ్నించిన తర్వాత వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ముంబై: మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ సహాయకులను ఇద్దరిని అరెస్టు చేశారు. అనిల్ దేశ్ ముఖ్ మీద రూ. 100 కోట్ల లంచానికి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇద్దరి అరెస్టును ఈడి అధికారులు ధ్రువీకరించారు. 

దేశ్ ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పాలండేను, వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండేను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధన కింద గంటల కొద్దీ ప్రశ్నించిన తర్వాత వారిద్దరిని అరెస్టు చేశఆరు. 

తమ విచారణకు ఇద్దరు సహకరించడం లేదని, దీంతో వారిని బల్లార్డ్ ఎస్టేట్ లోని తమ కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నామని వారు చెప్పారు. 

click me!