తుపాకి గురిపెట్టి బాలికపై ఎస్సై లైంగిక వేధింపులు: తల్లి, పెద్దమ్మ సహకారం

Published : Jun 26, 2021, 07:32 AM IST
తుపాకి గురిపెట్టి బాలికపై ఎస్సై లైంగిక వేధింపులు: తల్లి, పెద్దమ్మ సహకారం

సారాంశం

17 ఏళ్ల బాలికపై కన్నేసిన ఎస్సై ఆమె తల్లి, పెద్దమ్మ సహకారంతో ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. తుపాకి గురిపెట్టి బెదిరించాడు. చివరకు మహిళా పోలీసుల చేతికి చిక్కాడు.

చెన్నై: తూపాకి గురిపెట్టి 17 ఏళ్ల బాలికపై ఓ ఎస్సై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి, పెద్దమ్మ ఎస్సైకి సహకరించారు. ఆ ముగ్గురిని కూడా పోలీసులు శుక్రవారం అర్సెటు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని జరిగింది. 

సతీష్ కుమార్ అనే వ్యక్తి చెన్నై కాశిమేడు పోలీసు స్టేషన్ లో స్పెషల్ టీమ్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను మాధవరంలో భద్రతకు సంబంధించిన విధులు నిర్వహించాడు. ఈ సమయంలో అక్కడి రేషన్ షాపులో పనిచేస్తున్న మహిళతో అతను పరిచయం పెంచుకున్నాడు. తరుచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆమె 17 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. 

ఎస్సైకి బాలిక తల్లి, పెద్దమ్మ కూడా సహకరిస్తూ వచ్చారు. బాలికను లొంగదీసుకునేందుకు ఎస్సై తుపాకిని గురిపెట్టడం ప్రారంభించాడు.  తాను చెప్పినట్లు వినకపోతే తండ్రిని, తమ్ముడిని కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. అయినా బాలిక అతనికి చిక్కలేదు.

ఎట్టకేలకు తల్లి, పెద్దమ్మ సహకారంతో తనను ఓ ఎస్సై వేధిస్తున్నట్లు తండ్రి దృష్టికి తెచ్చింది. తండ్రి నిస్సహాయత ప్రదర్శించాడు. దీంతో తల్లి, పెద్దమ్మలపై తిరగబడడం ప్రారంభించాింది. ఆ తర్వాత వాట్సప్ ద్వారా పుళల్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారం మహిళా పోలీసులు గురువారం రాత్రి బాలిక తల్లిని, పెద్దమ్మను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎస్సై సతీష్ కుమార్ ను శుక్రవారం అరెస్టు చేశారు.    

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word