కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

Published : Jun 26, 2021, 07:58 AM ISTUpdated : Jun 26, 2021, 08:08 AM IST
కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

సారాంశం

ఉత్కర్ష్ పుట్టిన రోజు సందర్భంగా దేవి పటాన్ ఆలయానికి వెళ్తుండగా.. లోక్ హవా గ్రామం వద్ద ఓ ద్విచక్రవాహన దారుడిని తప్పించే క్రమంలో.. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు వివరించారు

కారు ప్రమాదానికి గురై.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకువెళ్లడంతో.. వారు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్- తులసిపూర్ రహదారిపై చోటుచేసుకుంది.

మృతులు గోండ జిల్లాలోని మన్హానా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ సింగ్(38), స్నేహలత(35), శత్రోహన్ కుమార్(30), సౌమ్య(18), లిల్లీ(14), ఉత్కర్ష్(12) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

ఉత్కర్ష్ పుట్టిన రోజు సందర్భంగా దేవి పటాన్ ఆలయానికి వెళ్తుండగా.. లోక్ హవా గ్రామం వద్ద ఓ ద్విచక్రవాహన దారుడిని తప్పించే క్రమంలో.. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు వివరించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలు కావడంతో... అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఆరుగురిని గ్రామస్థుల సాయంతో బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. సౌమ్య, లిల్లీ కొన ఊపిరితో బయటపడినప్పటికీ.. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు విడిచారు. ఈ ఆరుగురిని జిల్లా మెమోరియల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్