
పెంటపాడు : సంరక్షకుడే ఆ ఇద్దరు చిన్నారుల పాలిట కీచకుడయ్యాడు. ఐదు నెలలుగా వారిపై అత్యాచారం చేస్తున్నా ఏం జరుగుతుందో తెలియని పసి హృదయాలు.. బైటికి చెప్పుకోలేకపోయాయి. ఈ హృదయవిదారక సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని Nizamabadజిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమార్తె, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు మనవరాళ్లతో రెండేళ్లుగా పెంటపాడులో ఉంటుంది.
Thadepalligudem తాళ్లముదునూరుపాడుకు చెందిన ఉసుమర్తి పవన్ కుమార్ (30) వారితో పాటే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ కుమార్తె ఐదు నెలల కిందట జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లగా బాలికలు అమ్మమ్మ, పవన్ కుమార్ సంరక్షణలో ఉంటున్నారు.
రెండు రోజుల కిందట ఆ చిన్నారులు ఇద్దరూ పొత్తి కడుపులో నొప్పిగా ఉంటోందని అమ్మమ్మకు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించింది. ఆ చిన్నారులిద్దరూ తమకు ఏం జరిగిందో.. విషయాన్ని అమ్మమ్మకు తెలిపారు. అది విన్న అమ్మమ్మ తట్టుకోలేకపోయింది. వెంటనే బుధవారం రాత్రి పెంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదయ్యింది. గురువారం ఏలూరు పోలీస్స్టేషన్ డిఎస్పి కేవీ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్ బాధితులను కలిసి వివరాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులకు వైద్య పరీక్షలు చేయించారు. నివేదిక రావల్సి ఉంది.
బాలుడిపై అత్యాచారం చేసిన చర్చి ఫాదర్.. సంచలన తీర్పునిచ్చిన ముంబై కోర్టు..
ఇదిలా ఉండగా, ఓ చర్చి ఫాదర్.. 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరేళ్ల క్రితం కేసు నమోదు కాగా.. తాజాగా POCSO ప్రత్యేక కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. 2015 ఆగస్టులో ఓ చర్చిలో క్యాథలిక్ మతగురువుగా ఉన్న ఫాదర్ జాన్సన్ లారెన్స్.. బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసలు విచారణ చేపట్టారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఫాదర్ జాన్సన్ లారెన్స్‌ను (Jhonson Lawrence) పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితులు జైలులో ఉన్నాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం.. బాధితుడు నిత్యం ప్రేయర్ చేసేందుకు చర్చికి వెళ్లేవాడు. ఆగస్టు 2015లో ఒకరోజు.. నిందితుడు బాలుడిని చర్చిలో ఒంటరిగా ఉండమని అడిగాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బాలుడిని నిందితుడు బెదిరించాడు.
ఈ మేకకు రోజూ ‘చికెన్ బిర్యానీ’ లేందే ముద్ద దిగదు... !!
దీంతో భయపడిన బాలుడు ఈ విషయం ఎవరికి చెప్పలేదు. నవంబర్‌లో నిందితుడు మరోసారి బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రవర్తనలో మార్పు రావడంతో.. తల్లిదండ్రులు నీలదీసేసరికి అసలు విషయం బయటపెట్టేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుడు తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పాడు.