మరో దేశంగా కాశ్మీర్, లడ్డాఖ్: మరోసారి బరితెగించిన ట్విట్టర్

By narsimha lodeFirst Published Jun 28, 2021, 4:39 PM IST
Highlights

:ట్విట్టర్ మరోసారి బరితెగించింది.  భారత భూభాగాలను తప్పుగా చూపింది.  కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ లను  ఇండియాలో అంతర్భాగంగా కాకుండా ఇతర ప్రాంతాలుగా చూపింది. ట్విట్టర్ తీరుపై కేంద్రం సీరియస్ అయింది.

న్యూఢిల్లీ:ట్విట్టర్ మరోసారి బరితెగించింది.  భారత భూభాగాలను తప్పుగా చూపింది.  కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ లను  ఇండియాలో అంతర్భాగంగా కాకుండా ఇతర ప్రాంతాలుగా చూపింది. ట్విట్టర్ తీరుపై కేంద్రం సీరియస్ అయింది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన  ఐటీ నిబంధనలను ట్విట్టర్ అమలు చేయడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ విషయమై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ట్విట్టర్ హాజరైంది.  కొత్త ఐటీ రూల్స్ ప్రకారంగా వ్యవహరించాలని కేంద్రం ఆదేశించినా కూడ ట్విట్టర్ సరిగా వ్యవహరించలేదని కేంద్రం సీరియస్ గా ఉంది. ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్ ను ఇండియాలో అంతర్భాగంగా చూపలేదు.

ట్విట్టర్ ట్వీప్ లైప్ సెక్షన్ లో జమ్మూ కాశ్మీర్ , లడ్డాఖ్ ప్రాంతాలను భారత్ లో భాగంగా చూపలేదు. వాటిని వేరే దేశంగా చూపారు. ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపడం ట్విట్టర్ కు ఇదేం కొత్త కాదు. చైనాలో జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ ను అంతర్భాగంగా గతంలో చూపింది. ఆ సమయంలో ట్విట్టర్ కు కేంద్రం లేఖ రాసింది.

భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేందుకు లేదా అగౌరవపర్చేందుకు ట్విట్టర్ చేసే ఏ ప్రయత్నం కూడ తమకు ఆమోదం కాదని  కేంద్రం రాసిన లేఖలో ట్విట్టర్ కు తేల్చి చెప్పింది.ఈ ఏడాది మే 31న ట్విట్టర్ తన తాత్కాలిక ఫిర్యాదుల అధికారిగా ధర్మేంద్ర చతుర్ ను నియమిస్తున్నట్టుగా ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. చట్టబద్దమైన పోస్టులకు బయటి వ్యక్తుల నియామకాన్ని అంగీకరించలేమని ప్రభుత్వం తెలిపింది.

click me!