కరోనా ప్రభావిత రాష్ట్రాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

By narsimha lodeFirst Published Jun 28, 2021, 3:27 PM IST
Highlights

న్యూఢిల్లీ: కరోనాతో ప్రభావితమైన రాష్ట్రాలకు కూ. 1.1 లక్షల కోట్ల రుణ పథకం అందిస్తున్నామని  కేంద్ర ఆర్ధిక శాఖ నిర్మలా సీతారామన్ మంత్రి తెలిపారు.  

న్యూఢిల్లీ: కరోనాతో ప్రభావితమైన రాష్ట్రాలకు కూ. 1.1 లక్షల కోట్ల రుణ పథకం అందిస్తున్నామని  కేంద్ర ఆర్ధిక శాఖ నిర్మలా సీతారామన్ మంత్రి తెలిపారు.  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  సోమవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణానికి మూడేళ్లపాటు కేంద్రం గ్యారెంటీ ఇవ్వనుందని మంత్రి చెప్పారు. ఆత్మనిర్బర్ ప్యాకేజీ కింద కేంద్రం ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు.

ఆరోగ్య రంగానికి అదనంగా రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గరిష్టంగా రాష్ట్రాలకు రూ. 100 కోట్ల వరకు రుణం అందిస్తామన్నారు.ఇతర రంగానికి రూ. 60 వేల కోట్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.వైద్య రంగంలో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని మంత్రి వివరించారు.

కరోనాతో ప్రభావితమైన రాష్ట్రాలకు కూ. 1.1 లక్షల కోట్ల రుణ పథకం అందిస్తున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ నిర్మలా సీతారామన్ మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. pic.twitter.com/ELAIvnUpeI

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు సులభతరం చేయడానికి క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. ఒక వ్యక్తికి గరిష్టంగా రూ. 1.25 లక్షలు ఇవ్వనున్నారు. వడ్డీ రేటు 2 శాతంగా నిర్ణయించారు. ఈసీఎల్‌జీఎస్ పథకం పరిమితి దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాల కోసం ప్రభుత్వ హామీని అందించనుంది. గతంలో ప్రభుత్వం దీన్ని 3 లక్షలుగా  ప్రకటించింది. ప్రస్తుతం దీన్ని 4.3 లక్షల కోట్లకు పెంచింది.

కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ పథకం ద్వారా 11 వేల మందికి పైగా రిజిస్టర్డ్ టూరిస్ట్ గైడ్స్, ట్రావెల్, టూరిజం వాటాదారులకు ఆర్ధిక సహాయం ప్రకటించారు మంత్రి.వీసాల జారీ ప్రారంభమైన తర్వాత తొలి 5 లక్షల మందికి ఉచితంగా పర్యాటక వీసాలు ఇవ్వబడుతాయన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా మంత్రి తెలిపారు. కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలను ఇబ్బందుల నుండి తప్పించేందుకు గాను 8 రిలీఫ్ ప్యాకేజీలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించారు.ఆత్మనిర్బర్ భారత్  రోజ్‌గార్ యోజన కింద యజమానులు, ఉద్యోగులకు ఈపీఎఫ్ మద్దతును 2022 మార్చి 31వరకు పొడిగిస్తున్నామని నిర్మలా తెలిపారు.


 

click me!