కీచక పోలీస్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ప్రేమ పేరుతో మోసం చేసి... చివరికి...

Published : Jun 28, 2021, 03:23 PM IST
కీచక పోలీస్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ప్రేమ పేరుతో మోసం చేసి... చివరికి...

సారాంశం

తమిళనాడులో ఓ యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతని కోసం మహిళా పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాలు కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి తారసపడింది.

ఆమె నెంబర్ తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు.  ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్మెన్ గా ఉన్నాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు.  తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు.

అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.  ఆమె ఎస్పీ జయ కుమార్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పి కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అతన్ని ఆదివారం సస్పెండ్ చేశారు.

 ఈ సమాచారంతో జాక్సన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని కోసం తిరుచెందూరు మహిళా పోలీసులు గాలిస్తున్నారు కొద్దిరోజులుగా అధిక సంఖ్యలో పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం గమనార్హం.

క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన కేసులో అథ్లెటిక్‌ శిక్షకుడు నాగరాజన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న పూర్వ క్రీడాకారాణులు సైతం ఆన్లైన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయనపై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులు కమిషనర్ శంకర్‌ జివ్వాల్‌ ఆదివారం ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu