సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొంటాం: నిర్మలా సీతారామన్

By narsimha lode  |  First Published May 17, 2020, 11:31 AM IST

సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొంటామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 


న్యూఢిల్లీ: సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొంటామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 

ఆదివారం నాడు ఉదయం న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.  వలస కార్మికులను ఆదుకోవడం దాకా అన్ని కోణాలను స్పృశించినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించగానే గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

Latest Videos

undefined

ఇప్పటికే 8.19 కోట్ల మంది రైతులకు నేరుగా రూ. 2వేల కోట్లు  ఇచ్చినట్టుగా చెప్పారు.ఈ ఏడాది మే 16వ తేదీ వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో 2వేల రూపాయాలు జమ చేస్తామని ఆమె ప్రకటించారు. 

 పేదలు, వలస కూలీల ఆకలి తీర్చడం తమ ప్రభుత్వ బాధ్యత అని ఆమె అన్నారు. సంక్షోభ సమయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ అవకాశాలను వెతుక్కొంటామన్నారు. 

also read:బేకరి యజమానికి కరోనా: షాపుకు వచ్చిన 500 మంది శాంపిల్స్ సేకరణ

జన్‌ధన్ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదును బదిలీ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 2.2 కోట్ల మంది నిర్మాణ రంగ కూలీలకు రూ.3,950 కోట్లను అందించామన్నారు. మహిళలకు రూ. 10,025 కోట్లు అందించినట్టుగా చెప్పారు. వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

జ్వల పథకం కింద 6.81 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్టుగా మంత్రి తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు ఒకేసారి నగదును విత్ డ్రా చేసుకొన్నారని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ, హెల్త్, వ్యాపారాలు, డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఈజ్ ఆఫ్  డూయింగ్ బిజినెస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వాలు వనరులు అనే  అంశంపై చివరి రోజున పాలసీని వివరించనున్నట్టుగా మంత్రి తెలిపారు.

click me!