బేకరి యజమానికి కరోనా: షాపుకు వచ్చిన 500 మంది శాంపిల్స్ సేకరణ

By narsimha lode  |  First Published May 17, 2020, 11:07 AM IST

బేకరి యజమానికి కరోనా సోకింది. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 500 మంది జాబితాను అధికారులు రడీ చేశారు. వీరి శాంపిల్స్ ను తీసి పరీక్షలకు పంపుతున్నారు. ఈ ఘనట కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
 


తిరువనంతపురం:బేకరి యజమానికి కరోనా సోకింది. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాను అధికారులు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 500 మంది జాబితాను అధికారులు రడీ చేశారు. వీరి శాంపిల్స్ ను తీసి పరీక్షలకు పంపుతున్నారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని వందెన్మెడ్ పంచాయితీ పరిధిలో బేకరీ షాపు యజమానికి కరోనా సోకింది. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ఈ విషయాన్ని వైద్యాధికారులు ధృవీకరించారు. ఈ విషయాన్ని గుర్తించి తర్వాత అతడిని తోడుపుఝ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బేకరి యజమాని కుటుంబాన్ని కూడ క్వారంటైన్ కు తరలించారు.

Latest Videos

also read:విద్యార్థులకు గుడ్‌న్యూస్: టెన్త్ పరీక్షలు రద్దు, కానీ...

ఈ బేకరికి ఎవరెవరు వచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. బేకరి షాపుకు ఎవరెవరు వచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 500 మంది అధికారుల జాబితాను సిద్దం చేశారు. ఈ షాపులో ఐదు నిమిషాల కంటె ఎక్కువ సేపు ఎవరెవరు గడిపారనే విషయమై ఆరా తీస్తున్నారు.  వీరిందరి నుండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతున్నారు.

స్థానిక గ్రామ పంచాయితీకి చెందిన వారే ఎక్కువగా ఈ బేకరి షాపుకు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన వారిలో ఎవరికి కూడ కరోనా నిర్ధారణ కాలేదని తేలింది. ఇంకా మిగిలిన వారి శాంపిల్స్ ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

click me!