ట్రంప్ ఏమైనా రాముడా..? ఎవరికి ప్రయోజనం..? మోదీపై కాంగ్రెస్ ఫైర్

By telugu news teamFirst Published Feb 24, 2020, 12:54 PM IST
Highlights

ఈ పర్యటన వల్ల భారత్ కు ఏం ప్రయోజనం కలుగుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. కేవలం ట్రంప్ ని సంతోషపరచడానికే మోదీ రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.
 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటనపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి మండిపడ్డారు. ట్రంప్ ఏమీ రాముడు కాదని.. ఆయన కోసం మోదీ ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు, రేపు ట్రంప్... భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కోసం మోదీ భారీ ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలో సంప్రదాయ నృత్యాలతో భారీ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన భోజన ఏర్పాట్లు., హోటల్ గదిలో ఖర్చులు తదితర వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన కోసం ఇంత ఖర్చు చేస్తున్నారన్న విషయంపై కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత ఆధిర్ రంజన్ స్పందించారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం భారత గడ్డను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

Also Read హైదరాబాదును గుర్తు చేసుకుంటూ ఇవాంక ట్రంప్ ట్వీట్...

ఈ పర్యటన వల్ల భారత్ కు ఏం ప్రయోజనం కలుగుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. కేవలం ట్రంప్ ని సంతోషపరచడానికే మోదీ రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.

అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. రాముడేమీ కాదని.. ఆయన కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అమెరికాలో చాలా మంది గుజరాతీలు స్థిరపడ్డారని.. వారి ఓట్లను ఆకర్షించడానికే ట్రంప్ ఈ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు.

గతంలో వచ్చిన అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులను కూడా కలిసేవారని.. ఈసారి అలాంటి ఏర్పాట్లేమీ జరగలేదన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వబోయే విందుకు పలువురు నాయకులను ముఖ్యమంత్రులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ ఆహ్వానం కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ కి కూడా అందింది. అయితే.. ఆయన మాత్రం ఈ విందుకు వెళ్లడం లేదని స్పష్టం చేయడం గమనార్హం. 

click me!