హైదరాబాదు పర్యటనను గుర్తు చేసుకుంటూ ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ట్వీట్ చేశారు. భారతదేశానికి మరోసారి రావడంపై ఆమె ఈ ట్వీట్ చేశారు.
షింగ్టన్: భారత పర్యటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాదు పర్యటనను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. భారత పర్యటనకు బయలుదేరే కొన్ని గంటల ముందు ఆమె ట్విట్టర్ లో తన మనోగతాన్ని వెల్లడించారు.
రెండేళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొన్నానని, ఆ తర్వాత మళ్లీ మోడీని కలుస్తున్నానని, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాల మధ్య స్నేహాన్ని వేడుకగా చేసుకోడానికి ఇండియాకు తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.
undefined
Two years after joining at the Global Entrepreneurial Summit in Hyderabad, I am honored to return to India with and to celebrate that the grand friendship between the world’s two largest democracies has never been stronger! 🇺🇸 🇮🇳 pic.twitter.com/r1d5fl9mtq
— Ivanka Trump (@IvankaTrump)ట్వీట్ లో గతంలోని తన హైదరాబాదు పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా జత చేశారు. డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జరేద్ కుష్నెర్ హైదరాబాదు పర్యటనకు వచ్చారు.
హైదరాబాదులో 2017లో హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ జరిగింది.. ఈ సమ్మిట్ లో ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొన్ారు. దాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.ఇవాంక గౌరవార్థం అప్పుడు నరేంద్ర మోడీ హైదరాబాదులోని ఫలక్ నుమాలో విందు ఇచ్చారు.