
India-US Relationship : ఇండియా, యుఎస్ మధ్య వ్యాపార వివాదాల పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయం వెల్లడించారు. రెండు దేశాల మధ్య వ్యాపార అడ్డంకులను తొలగించేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
'రెండు దేశాల మధ్య వ్యాపార అడ్డంకులను పరిష్కరించడానికి ఇండియా, యుఎస్ చర్చలు జరుపుతున్నాయని తెలియజేయడానికి నాకు సంతోషంగా ఉంది. రాబోయే వారాల్లో నా మంచి స్నేహితుడు ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నాను. రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం త్వరలోనే వస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని ట్రంప్ రాసుకొచ్చారు.
ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్:
అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ''ఇండియా, యూఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు సహజ పార్ట్ నర్స్. తమ మధ్య వాణిజ్యపరంగా నెలకొన్న అడ్డంకులకు తొలగించేందుకు చర్చలు జరుగుతున్నాయి... ఇవి ఇరుదేశాల మధ్య నిరంతరం అపరిమిత వాణిజ్యం జరిగేందుకు సహాయపడతాయి. మా అధికారుల టీం ఇరుదేశాల మధ్య చర్చలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. నేను కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడాలని అనుకుంటున్నా. ఇరుదేశాల ప్రజల కోసం ఇద్దరం కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం'' అని ప్రధాని మోదీ అన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల చట్టబద్ధతపై వాదనలు నవంబర్‌లో విచారణకు వస్తాయని యుఎస్ సుప్రీంకోర్టు తెలిపింది. ఇండియాతో సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ నిర్ణయానికి దిగువ కోర్టులో చుక్కెదురైంది. ప్రకటించిన చాలా సుంకాలు చట్టవిరుద్ధమని యుఎస్ అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసర ఆర్థిక చట్టాన్ని ఉపయోగించి ఏకపక్షంగా సుంకాలు విధించడం ద్వారా అధ్యక్షుడి అధికార దుర్వినియోగం జరిగిందని యుఎస్ ఫెడరల్ కోర్టు పేర్కొంది.