2047 నాటికి యూపీని 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నం. నైపుణ్యం కలిగిన యువత, పక్కా ఇళ్ళు, బలమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, రైతుల ఆదాయం పెంచడమే యూపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
నైపుణ్యం గల యువత, అభివృద్ధి చెందిన గ్రామాలే సంపన్న ఉత్తరప్రదేశ్ కు నాంది పలుకుతాయని యోగి సర్కార్ భావిస్తోంది. 2047 నాటికి ఉత్తరప్రదేశ్ ను 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చి ప్రజల కలలు సాకారం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు, ప్రతి గ్రామానికి ప్రాథమికమైన మౌళిక సదుపాయాలు, ప్రతి యువకుడికి నైపుణ్య శిక్షణ అందించాలనేది యోగి ప్రభుత్వ ప్రయత్నం.
2017 కంటే ముందు పరిస్థితి ఎలా ఉండేది?
2017 కంటే ముందు ఉత్తర ప్రదేశ్ లో అస్తవ్యస్త పాలన ఉండేదని యోగి సర్కార్ చెబుతోంది. అంటే బిజెపి ప్రభుత్వం ఏర్పడకముందు, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టక ముందు రాష్ట్రంలో విద్య, గ్రామీణ వ్యవస్థలు ఎలా ఉండేవో వివరించారు.
ఉన్నత విద్య ఉద్యోగ సాధనకు తగినట్లుగా లేకుండె.
కేవలం 526 పాలిటెక్నిక్ లు, 2642 ఐటీఐలు మాత్రమే నడుస్తుండేవి.
పరిశోధన, ఆవిష్కరణలకు మౌలిక సదుపాయాలు చాలా తక్కువ.
గ్రామాల్లో పక్కా ఇళ్ళు, రోడ్లు, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలు లేవు.
పంచాయతీల వద్ద నిధులు, సామర్థ్యం లేకపోవడంతో పథకాలు సరిగ్గా అమలు కాలేదు.
విద్య, నైపుణ్య శిక్షణలో కొత్త మార్పులు
యోగి ప్రభుత్వం విద్య, నైపుణ్య శిక్షణను కాలానుగుణంగా మార్చింది.
“ఒక మండలం, ఒక విశ్వవిద్యాలయం” విధానంతో 24 ప్రభుత్వ, 49 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాడ్డాయి.
3310 ఐటీఐలు, 2138 పాలిటెక్నిక్ లు యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
టాటా టెక్నాలజీస్ సహకారంతో 150కి పైగా ఐటీఐలను ఆధునీకరించారు.
49.86 లక్షల ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడంతో విద్యార్థులు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టారు.
95కి పైగా సంస్థలకు NAAC గుర్తింపు, 67 సంస్థలకు జాతీయ ర్యాంకులు లభించాయి.
గ్రామీణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు
గ్రామాల ఆధునీకరణలో ప్రభుత్వం చారిత్రాత్మక కృషి చేసింది.
ఇప్పటివరకు 56.90 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్ళు లభించాయి.
PMAY-G కింద 36.57 లక్షల ఇళ్ళు మంజూరు, 36.34 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయి.
25 వేల కి.మీ. రోడ్ల విస్తరణ, బలోపేతం, 1385 కి.మీ. కొత్త రోడ్లు నిర్మించారు.
165 బ్లాక్ ప్రధాన కార్యాలయాలకు రెండు వరుసల రోడ్లు నిర్మించారు.
అమృత్ సరోవర్, అటల్ భూజల పథకాలతో నీటి భద్రతకు కొత్త మార్గం.
24,489 పంచాయతీ భవనాలు, ప్రతి పంచాయతీకి సచివాలయం ఏర్పాటు.
‘వికాసవంతమైన యూపీ 2047’ కార్యక్రమం
ఇది ప్రధాని మోదీ ‘వికాసవంతమైన భారతదేశం 2047’ కార్యక్రమంలో భాగమని సీఎం యోగి స్పష్టం చేశారు.
2030 నాటికి గ్రామాలు ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతుల్లో ముందంజ వేస్తాయి.
సీడ్ పార్కులు, మెరుగైన విత్తనాలు, పంటల వైవిధ్యం, ఆహార శుద్ధి ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది.
వ్యవసాయ పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
పాల, గుడ్ల ఉత్పత్తిలో యూపీ ప్రపంచ స్థాయిలో ముందంజ వేస్తుంది.
ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, సామాజిక భద్రత లభిస్తుంది.
పశ్చిమాంచల్ తరహాలో పూర్వాంచల్, బుందేల్ ఖండ్ లను అభివృద్ధి చేస్తారు.
6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా
2047 నాటికి యూపీ ఆర్థిక వ్యవస్థ 6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఇది భారతదేశ జీడీపీలో 20% అవుతుందని ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం:
16% వృద్ధి రేటును కొనసాగించాలి.
నైపుణ్యం గల శ్రామికవర్గం ప్రపంచ పరిశ్రమలకు దోహదపడుతుంది.
గ్రామీణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఉత్పాదకత ద్వారా ఆదాయం, వినియోగం పెరుగుతాయి.