చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ట్యాంకర్ డైవర్లు

By Rajesh Karampoori  |  First Published Jan 2, 2024, 10:36 PM IST

దేశవ్యాప్తంగా కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వంతో సమావేశం తర్వాత తమ సమ్మెను ముగించాలని ట్రక్కర్ల సంఘం నిర్ణయించింది


దేశవ్యాప్తంగా కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం దిగి వచ్చింది.  ట్రాన్స్‌పోర్టు సంఘాలతో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త చట్టం అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా కేంద్ర ప్రభుత్వంతో కీలక సమావేశం తర్వాత.. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (AIMTC) మంగళవారం నాడు అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపింది.

హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షాస్మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను త్వరలో ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది. భారతీయ న్యాయ సంహితపై తాము సమావేశమై చర్చించామనీ,  అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయనీ, కొత్త చట్టాలు ఇంకా అమలు కాలేదనీ,  AIMTCతో సంప్రదించిన తర్వాత మాత్రమే అమలు చేయబడతాయని ట్రక్కర్స్ ఛైర్మన్ మల్కిత్ సింగ్ బాల్ తెలిపారు. త్వరలో సమ్మె విరమిస్తామని, డ్రైవర్లు విధుల్లో చేరాలని కోరినట్లు తెలిపారు. 

Latest Videos

ఇదిలా ఉండగా.. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మాట్లాడుతూ.. పదేళ్ల (హిట్ అండ్ రన్ కేసుల్లో) శిక్ష విధించే చట్టంపై ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సంఘాలతో చర్చ జరిగింది. ఈ చట్టం ఇంకా అమలు కాలేదనీ, ఆ విషయాన్ని AIMTCతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నూతన చట్టాల్లో ఉన్నపదేళ్ల శిక్ష, జరిమానాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమృత్ లాల్ మదన్ అన్నారు.
 

click me!