Lok Sabha Elections: పార్లమెంటు ఎన్నికల్లో హంగ్.. మాయావతి వ్యూహం ఏమిటో తెలుసా?

By Mahesh K  |  First Published Jan 2, 2024, 8:51 PM IST

లోక్ సభ ఎన్నికల్లో హంగ్ వస్తే మంచిదనే అభిప్రాయాల్లో బీఎస్పీ ఉన్నది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోకీ ప్రవేశం దక్కకపోవడంతో రేపు జరగబోయే పరిణామాలను ఈ రోజు ఊహించలేరంటూ మాయావతి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
 


Mayawati: కాన్షీ రాం స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి పార్లమెంటు ఎన్నికల వ్యూహంపై చాలా ప్రత్యేకంగా ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తాయి. ఈ పొత్తుల్లో లేని పార్టీలు తామూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వాలని అనుకుంటాయి. కానీ, బీఎస్పీ పంథా వేరుగా ఉన్నది. పార్లమెంటు ఎన్నికల్లో హంగ్ రావాలని, అలా వస్తే.. కొన్ని సీట్లు వచ్చినా తాము ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నది. బీఎస్పీ చీఫ్ మాయావతి ఇటీవల చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఇదే అని అర్థం అవుతున్నది. అలాంటి సంకీర్ణ ప్రభుత్వమే దేశానికి హితం అని ఆమె తెలిపారు. అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలకు అలాంటి ప్రభుత్వమే మద్దతు ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

నిజానికి బీఎస్పీ చరిత్రలో సంకీర్ణం అనేది చాలా ప్రధానమైనది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలతో బీఎస్పీ పొత్తులు పెట్టుకున్నది. ప్రభుత్వంలో భాగమైంది. ప్రభుత్వానికి సారథ్యం వహించింది కూడా. బీజేపీ మద్దతుతోనే మాయావతి చీఫ్ మినిస్టర్ అయ్యారు. బీఎస్పీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఈ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి కీలక పాత్ర పోషించింది.

Latest Videos

undefined

కాన్షీరాం కూడా బలహీన ప్రభుత్వమే బీఎస్పీకి మంచిదనే మాట అనేవారు. బీఎస్పీ దేశాన్ని పాలించే సామర్థ్యం సంపాదించే వరకు బలహీన ప్రభుత్వం ఉండటమే మంచిదని తరుచూ చెప్పేవారు. మాయావతి కూడా తన రాజకీయ పుస్తకంలో నుంచి ఓ ముక్క తీసి ఇప్పుడు కీలక వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరకుండా అడ్డుకోవడంపై ఆమె ఇలా మాట్లాడారు. ‘రేపు జరగబోయే రాజకీయ భంగపాటు గురించి జాగ్రత్త వహించండి. రేపు ఎవరి అవసరం ఎవరికి ఉంటుందో ఈ రోజు అంచనా వేయలేం’ అని కామెంట్ చేశారు.

Also Read : Revanth Reddy: తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి! సీఎం రేవంత్‌తో శంకరమ్మ భేటీ

2024 ఎన్నికలపై బీఎస్పీ

2024 లోక్ సభ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ తీర్పు రావొద్దని బీఎస్పీ ఆశిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని పార్టీలు దళిత ప్రధాని డిమాండ్‌ను తెర మీదికి తెచ్చారు. వాస్తవానికి ఇది బీఎస్పీ డ్రీమ్. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అది మాయావతి డ్రీమ్. కానీ, ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ సారథి మల్లికార్జున్ ఖర్గే రూపంలో ఓ ప్రత్యర్థి ఎదురయ్యారు. 1989 లోక్ సభ ఎన్నికల్లో ఓటు శాతం 2గా ఉన్న బీఎస్పీ ఆ తర్వాత 2019లో అది 20 శాతానికి పెంచుకుంది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగింది. కానీ, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు శాతం 12.88 శాతానికి పడిపోయింది. ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికలు ఈ పార్టీకి కూడా కీలకమైనవిగా మారాయి. అయితే, లోక్ సభ ఎన్నికల వరకు బీఎస్పీ ఏ కూటమిలో చేరుతుంది? ఎలా పోటి చేస్తుందనే విషయాలపై స్పష్టత వస్తుంది.

click me!