సెల్ ఫోన్ లోడ్ తో వెళ్తూ పడిపోయిన ట్రక్కు.. ఎగబడ్డ జనం..!

Published : Jun 17, 2021, 08:05 AM ISTUpdated : Jun 17, 2021, 08:09 AM IST
సెల్ ఫోన్ లోడ్ తో వెళ్తూ పడిపోయిన ట్రక్కు.. ఎగబడ్డ జనం..!

సారాంశం

మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో  షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకుంది. ట్ర‌క్కు నుంచి సుమారు రూ.70 ల‌క్ష‌ల విలువ‌చేసే ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎత్తుకెళ్లారు.  

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్తున్న ఓ భారీ ట్రక్కు ఒక్కసారిగా రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది.  కాగా.. ఆ ట్రక్కులో నుంచి సెల్ ఫోన్లు, కంప్యూటర్లు.. అన్నీ కింద పడిపోయాయి. అంతే.. ట్రక్కు పడిపోగానే.. స్థానికులంతా అక్కడ దానిపై ఎగబడ్డారు.

చేతికి అందిన వస్తువల్లా ఎత్తుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌ మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో  షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకుంది. ట్ర‌క్కు నుంచి సుమారు రూ.70 ల‌క్ష‌ల విలువ‌చేసే ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎత్తుకెళ్లారు.


ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న స్థానిక పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానికులు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోతీచంద్ రాథోడ్ పేర్కొన్నారు. పోలీసుల విజ్ఞప్తితో కొంద‌రు తిరిగి అప్ప‌గించారు. కాగా ఇప్పటివరకు 40 శాతం వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.కొందరు మాత్రం వస్తువులను తిరిగి ఇవ్వడానికి అంగీకరించకపోవడం గమనార్హం. అయితే..  సోదాలు చేసి మరీ  వాటిని స్వాధీనం చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?