సెల్ ఫోన్ కోసం కరోనా రోగిని చంపేశారు..!

Published : Jun 17, 2021, 07:40 AM ISTUpdated : Jun 17, 2021, 07:48 AM IST
సెల్ ఫోన్ కోసం కరోనా రోగిని చంపేశారు..!

సారాంశం

మే 23న కోవిడ్ సోకిన సునీత అనే గృహిణి చికిత్స తీసుకోవడానికి అదే ఆస్పత్రిలో చేరారు.

రోజు రోజుకీ సమాజంలో మానవత్వం పూర్తిగా తగ్గిపోతోంది. ఇందుకు ఈ సంఘటనే ఉదాహరణ. తాజాగా డబ్బు, సెల్ ఫోన్ కోసం కరోనా రోగిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన చెన్నైలోని ఓ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరువొట్టియూర్ కు చెందిన 40ఏళ్ల రతీదేవి చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మే 23న కోవిడ్ సోకిన సునీత అనే గృహిణి చికిత్స తీసుకోవడానికి అదే ఆస్పత్రిలో చేరారు.

బాధితురాలి వద్ద నగదు చూసిన రతీదేవి తన అవసరాల నిమిత్తం వాటిని కాజేయాలనుకుంది. పథకం ప్రకారం సునీతతో ఆస్పత్రి చివరి అంతస్తు వరకు తీసుకువెళ్లి... అక్కడ కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి... ఆమె దగ్గరున్న డబ్బు, సెల్ ఫోన్ కాజేసింది. జూన్ 8న జరిగిన ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి... ఆమె వద్ద  నుంచి సెల్ ఫోన్, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

FSSAI Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే
బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory