ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది దుర్మరణం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

Published : Sep 13, 2023, 12:46 PM IST
ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది దుర్మరణం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

సారాంశం

రాజస్తాన్‌లో నేషనల్ హైవేపై సాంకేతిక సమస్యతో ఆగిపోయిన బస్సును వేగంగా వస్తున్న ఓ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులోని 11 మంది ప్రయాణికులు మరణిచారు. ఈ ఘటన భరత్ పూర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు చోటుచేసుకుంది.  

జైపూర్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి వున్న బస్సును ఓ ట్రక్కు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 11 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఎక్స్‌లో ప్రకటించింది.

Also Read: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. సైనికుడిని కాపాడుతూ, కాల్పులకు గురై ఆరేళ్ల ఆర్మీ కుక్క మృతి

ప్రయాణికులతో నిండిన ఓ బస్సు గుజరాత్ నుంచి మాథురాకు వెళ్లుతున్నది. ఆ బస్సు రాజస్తాన్‌లో భరత్ పూర్ జిల్లా పరిధిలో జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో ఆ బస్సు రోడ్డుపైనే ఆగిపోయింది. అదే దారిలో వస్తున్న ఓ ట్రక్కు వేగంగా వెనుక నుంచి ఆ బస్సును ఢీకొంది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో బస్సులోని 11 మంది ప్రయాణికులు మరణించారు. ఇందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు పీటీఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !