
మధ్యప్రదేశ్ : madhya pradeshలోని విదిశాలో అమానవీయ ఘటన జరిగింది. ఆశ మనిషుల్ని మానవత్వం మరిచిపోయేలా చేసింది. ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని goats మీద చూపించిన శ్రద్ధ ప్రాణాపాయ స్థితిలో ఉన్న human మీద చూపించలేకపోయారు. దీంతో ఓ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే..
మధ్యప్రదేశ్ లోని విదిషా నుంచి హైదరాబాద్ కు మేకలను తీసుకెళ్తున్న truck మార్గమధ్యంలో overturns అయ్యింది. డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. ఈ విషయం తెలిసిన సమీపంలోని గ్రామస్తులు వాటిని పట్టుకు పోయేందుకు పోటీపడ్డారు. కానీ లారీ కింద చిక్కుకుపోయిన వ్యక్తిని మాత్రం ఎవరూ కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
మధ్యప్రదేశ్లోని సిరోంజ్ జిల్లా, కంకర్ ఖేడి లోయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివపురి నుంచి సుమారు వంద మేకలతో బయలుదేరిన లారీ.. రాత్రి 8 గంటల సమయంలో కంకర్ ఖేడి వద్ద అదుపుతప్పి.. లోయలో పడిపోయింది. ఇది గమనించిన సమీపంలోని గ్రామస్తులు... ఘటనా స్థలానికి పరుగు పరుగున చేరుకున్నారు. అక్కడున్న మేకలను పట్టుకు పోయేందుకు పోటీపడ్డారు. లారీలోని మేకలను అందిన కాడికి దోచుకున్నారు. టూవీలర్ల మీద ఇద్దరిద్దరుగా వచ్చి.. మధ్యలో మేకలను వేసుకుని పట్టుకుపోయారు.
విషయం తెలిసి అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారించినా వినలేదు. ట్రక్కులోకి ఎక్కిమరీ మేకల్ని తీసుకోసాగారు. దీంతో పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జి చేశారు. అయితే మేకల మీద పెట్టిన శ్రద్ధ ట్రక్కు డ్రైవర్ విషయంలో చూపించలేదు. ట్రక్కు కింద చిక్కుకుపోయిన సచిన్ కాటిక్ అనే వ్యక్తిని మాత్రం ఎవరూ సకాలంలో కాపాడలేదు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పిల్లలకు టీకా వేసిన తర్వాత ప్యారాసెటమల్ వేయాలా? భారత్ బయోటెక్ ఏమన్నదంటే..!
ఇదిలా ఉండగా, చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. సాధారణంగా డిసెంబర్, జనవరిలో Poulty, egg కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ పెరగడంతో priceలు కూడా పెరుగుతాయి. కానీ జనవరి 3 తరువాత దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు రాత్రిపూట Curfew విధించాయి. దీంతో గుడ్లు, చికెన్ సరఫరాపై ప్రభావం పడింది. ఢిల్లీలోని ఘాజీపూర్ ముర్గా మండిలో చికెన్ ధరలు 25 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో గుడ్ల ధరలపైనా ప్రభావం పడింది.
దుకాణాల్లో రూ. 200 వరకు విక్రయించే గుడ్ల ధర రూ.150 కి తగ్గింది. wholesale marketలోనూ గుడ్ల ధరలు పడిపోయాయి. Boiled eggs ఇప్పుడు చిల్లరగా రూ.7కు విక్రయిస్తున్నారు. ఇంతకుముందు ఎనిమిది నుంచి పది రూపాయల వరకు విక్రయించే వారు. ప్రస్తుతం దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గుడ్లు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. ఇక్కడ 100 కోడిగుడ్ల ధర రూ.450 కి కంటే తక్కువకు పడిపోయింది.
ఢిల్లీ లోని అతిపెద్ద చికెన్ మార్కెట్ అయిన ఘాజీపూర్ వ్యాపారులు మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల ఆర్డర్లు తగ్గాయని చెప్పారు. 10 రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర రూ.200కి ఉందని ఘాజీపూర్ ముర్గా మండిలో దుకాణం నడుపుతున్న మహ్మద్ అనాస్ అన్నారు. అదే సమయంలో జనవరి 3 తర్వాత కిలో రూ.150కి తగ్గిందని పేర్కొన్నారు.