hit and run:దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనలు, పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టిన వాహనాలు

Published : Jan 02, 2024, 01:08 PM IST
hit and run:దేశ వ్యాప్తంగా  ట్రక్కు డ్రైవర్ల నిరసనలు, పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టిన వాహనాలు

సారాంశం

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన హిట్ అండ్ రన్ కేసులకు కొత్త చట్టంతో ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.


న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్  కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త చట్టంతో  ట్రక్కు డ్రైవర్లు  ఆందోళనకు దిగారు.  

భారతీయ న్యాయ సంహిత  కింద హిట్ అండ్ రన్ కేసుల్లో  రూ. 7 లక్షల జరిమానాతో పాటు  10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం  కొత్త చట్టం తెచ్చింది.  ఈ నిబంధనపై ట్రక్కు డ్రైవర్లు టాక్సీ, బస్సు ఆపరేటర్లు సమ్మెను ప్రారంభించారు.

ముంబై మెట్రోపాలిటన్ రీజియనల్  1.20 లక్షల ట్రక్కులు, టెంపోలు, కంటైనర్లు 70 శాతానికి పైగా నిలిచిపోయాయి. మూడు రోజుల సమ్మె కారణంగా  ఇంధనంపై ప్రభావం చూపుతుంది.పండ్లు, కూరగాయల సరఫరాపై కూడ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ నిబంధనను తెచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం  తమతో చర్చించలేదని ఆలిండియా  మోటార్, గూడ్స్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ ప్రెసిడెంట్  రాజేంద్ర కపూర్  చెప్పారు.ఈ విషయమై ఆయన  జాతీయ మీడియా న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు.అయితే  తమ సంఘం నుండి  ఈ విషయమై  నిరసనలకు పిలుపు ఇవ్వలేదని ఆయన  చెప్పారు. నిరసనలతో  సమస్య పరిష్కారం కాదన్నారు.  ఈ విషయమై ప్రభుత్వం తమతో చర్చిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

మహారాష్ట్ర పుడ్,సివిల్ సప్లయిస్ శాఖ ద్వారా పోలీసుల సహాయాన్ని కోరింది.  ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో  ఈ సివిల్ సప్లయిస్ శాఖ పోలీసుల సహాయం కోరింది.ట్రక్కు డ్రైవర్ల సమ్మె కారణంగా నిత్యావసర సరుకుల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని  అధికారులు తెలిపారు.మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో  కూడ పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

 


 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !