12 మంది ఎంపీలపై సస్పెన్షన్: పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన

By narsimha lodeFirst Published Dec 2, 2021, 11:03 AM IST
Highlights

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 
 

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభ నుండి 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. గురువారం నాడు ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఆందోళనకు దిగింది.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే  రాజ్యసభ నుండి 12 మంది ఎంపీలను సస్పెన్షన్ కు గురయ్యారు.ఈ 12 మంది Mpలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే గురువారం నాడు Gandhi  విగ్రహం వద్ద Opposition ఎంపీలు నిరసన చేపట్టాయి.ఈ నిరసన కార్యక్రమంలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Paddy  ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి Trs ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారువరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు  టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.  పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ విషయమై ప్లకార్డులు చేతబూని నిరసనకు దిగారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆంధోళన కార్యక్రమాల్లో కూడా టీఆర్ఎస్ పాల్గొంటుంది.

also read:వరి ధాన్యం కొనుగోలుకై: పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే  రాజ్యసభ నుండి 12 మంది ఎంపీలను సస్పెన్షన్ కు గురయ్యారు.ఈ 12 మంది Mpలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే గురువారం నాడు Gandhi  విగ్రహం వద్ద Opposition ఎంపీలు నిరసన చేపట్టాయి.ఈ నిరసన కార్యక్రమంలో విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు.Paddy  ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి Trs ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ  టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని తేల్చి చెప్పినందున యాసంగిలో మాత్రం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే చూస్తూ ఊరుకోబోమని టీఆర్ఎస్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. 

ఇదిలా ఉంటే ఏపీ కంటే తెలంగాణ నుండే ఎక్కువగా బియ్యాన్ని సేకరించామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పార్లమెంట్ లో చెప్పారు  విజయవాడ ఎంపీ కేశినేని నాని వేసిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.2020-21 లో ఏపీ నుండి 56.67 లక్షల మెట్రిక్ టన్నలు Rice సేకరించినట్టుగా మంత్రి తెలిపారు. అదే సంవత్సరం Telangana నుండి 94.53 లక్షల టన్నుల బియ్యం సేకరించామన్నారు. 2019-20 లో ఏపీ నుండి 53.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుండి 74. 54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని మంత్రి వివరించారు. 2018-19 లో Andhra pradesh నుండి 48.06 లక్షలు, తెలంగాణ నుండి 51.90 లక్షల మెట్రిక్ టన్ను బియ్యం సేకరించినట్టుగా సాధ్వి నిరంజన్ తెలిపారు. ఏపీ కంటే తెలంగాణ నుండే ఎక్కువ బియ్యం సేకరించామని కేంద్ర మంత్రి  చెప్పారు.

click me!