నాలుగో భార్యకు ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Jan 20, 2023, 9:45 AM IST
Highlights

మూడు పెళ్లిళ్లు దాచిపెట్టి ఆ వ్యక్తి మరో వివాహం చేసుకున్నాడు. కానీ కొంత కాలం తరువాత నాలుగో భార్యకు ఈ విషయం తెలిసింది. ఇలా ఎందుకు చేశావని నిలదీసింది. దీంతో భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. 

అతడికి ఇది వరకే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఈ విషయాన్ని దాచి పెట్టి మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం తరువాత ఆ మహిళకు అసలు విషయం తెలిసింది. తన భర్తకు ఇది వరకే మూడు పెళ్లిళ్లు అయ్యాయని గుర్తించడంతో అతడిని నిలదీసింది. దీంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆమెను వదలించుకోవడానికి భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

బెంబేలెత్తించిన బెంగళూరు ట్రాఫిక్.. కారు దిగి మెట్రో ఎక్కిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి చెందిన ముస్లిం మహిళకు రాజస్థాన్ రాష్ట్రం ఖజ్రానాకు చెందిన 32 ఏళ్ల ఇమ్రాన్ వ్యక్తితో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. తరువాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే ఆ మహిళకు తన భర్తకు సంబంధించిన కొన్ని విషయాలు తెలిశాయి. ఇమ్రాన్‌కు ఇప్పటికే ముగ్గురు భార్యలు, పిల్లలు ఉన్నారని గుర్తించింది. దీంతో ఈ దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

కిడ్నాప్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్‌ అరెస్టు..

ఇలా గొడవలు జరుగుతుండటంతో ఈ వివాహాన్ని రద్దు చేసుకుందామని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు. రాజస్థాన్ నుంచే భార్యకు ‘‘తలాక్, తలాక్, తలాక్’’ అంటూ మెసేజ్ పంపించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని ఖజ్రానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఇమ్రాన్‌పై ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా..ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తుంది. ఇలా ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తుంది.

click me!