క్రైస్తవులపై తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. అంతా బీజేపీ 'ప్రచారం' అంటున్న నాయకురాలు..

By SumaBala Bukka  |  First Published Feb 22, 2024, 10:37 AM IST

సోమవారం కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లో అనన్య బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆమె పార్టీ సభ్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఆమెను దీనిమీద వివరణ కోరారు.


కోల్ కతా : క్రిస్టియన్ కమ్యూనిటీపై అనన్య బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ అనన్య బెనర్జీ మంగళవారం తన ప్రసంగం ఎలా ఎడిట్ చేశారో చెబుతూ ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. దీని ద్వారా బిజెపి వ్యతిరేక "ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని" నిప్పులు చెరిగారు.

సోమవారం కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లో అనన్య బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు తొలగించారు. బెనర్జీ తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ, "ఏదైనా సమాజాన్ని లేదా మతాన్ని నొప్పించాలనే ఉద్దేశ్యం కాదు. ఇది ఎవరితోనూ సంబంధం లేదని నేను నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు డిస్‌క్లైమర్ ఇచ్చాను. ఇది వాస్తవం కాదు... కేవలం ఒక ఉపమానం అని కథ అని చెప్పాను. ఇది ఏదో ఓ విదేశానికి సంబంధించినది, మన దేశం గురించి కాదు" రాజకీయవేత్తగా మారిన నటి అన్నారు.

Latest Videos

హిందు వ్యతిరేక పాలసీ: కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక బిల్లు 2024 ఆమోదంపై బీజేపీ ఫైర్

"నా ప్రసంగం 16 నిమిషాల నిడివి ఉంది. కేవలం కొంత భాగాన్ని మాత్రమే బీజేపీ ట్వీట్‌ చేసి, ప్రచారం చేస్తోంది. ఇలా ఎందుకు చేశారో స్పష్టంగా అర్థమవుతోంది. నా ప్రసంగాన్ని ముక్కలుగా ఎడిట్‌ చేశారు" అని ఆమె అన్నారు. నా వ్యాఖ్యలు ఎవరికైనా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారామె.

బెనర్జీ వ్యాఖ్యలపై ఆమె పార్టీ సభ్యుల నుంచి విమర్శలు వచ్చాయి. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. వాటిమీద ఆమె నుండి వివరణ కోరారు. "కేఎంసీ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కౌన్సిలర్ అనన్య బెనర్జీ ఒక నిర్దిష్ట వర్గం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. పార్టీ ఆమె అభిప్రాయాలను ఆమోదించదు. ఆమె అభిప్రాయాలను షేర్ చేయవద్దు. టీఎంసీ పురపాలక బృందం దీనిమీద అనన్య బెనర్జీ నుండి వివరణ కోరింది" అని మేయర్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

క్రిస్టియన్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు టిఎంసి, బందోపాధ్యాయలపై బిజెపి కౌన్సిలర్ సజల్ ఘోష్ మండిపడ్డారు. "కేఎంసీ బడ్జెట్ సెషన్‌లో చర్చ్‌కు ఏం పని? కౌన్సిలర్ గౌరవనీయమైన, ఫాదర్స్, సన్యాసినులను తన డర్టీ స్పీచ్‌లోకి ఎందుకు లాగారు? క్రిస్టియన్ కమ్యూనిటీని కించపరిచే అధికారం టీఎంసీకి ఎవరు ఇచ్చారు? కేఎంసీ ఈ కౌన్సిలర్‌ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని ఘోష్ చెప్పారు.

click me!