హిందు వ్యతిరేక పాలసీ: కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక బిల్లు 2024 ఆమోదంపై బీజేపీ ఫైర్

By narsimha lode  |  First Published Feb 22, 2024, 9:57 AM IST

కర్ణాటక ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని  బీజేపీ విమర్శించింది.  కర్ణాటక అసెంబ్లీలో ఆమోదించిన  కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాల బిల్లు 2024పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో  కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక  బిల్లు 2024 ఆమోదం పొందింది. ఈ విషయమై  కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ బిల్లు హిందూ వ్యతిరేకమైందిగా భారతీయ జనతా పార్టీ విమర్శించింది. కోటి రూపాయాల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాల ఆదాయంలో  10 శాతం ప్రభుత్వం వసూలు చేసుకొనేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

ఈ బిల్లుపై కాంగ్రెస్ సర్కార్ పై  బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.  కర్ణాటకలో సిద్దరామయ్య  ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైందని బీజేపీ ఆరోపించింది.  

Latest Videos

కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖజానాను నింపుకొనేందుకు  ప్రయత్నిస్తుందని  ఎక్స్ వేదికగా  బీజేపీ కర్ణాటక చీఫ్  విజయేంద్ర యడియూరప్ప  విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఆలయాల నుండి ఆదాయాన్ని ఎందుకు సేకరిస్తుందని  ఆయన ప్రశ్నించారు.

హిందూ వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తుందని  ఆయన విమర్శించారు.  హిందూ దేవాలయాల ఆదాయంపై  కన్ను పడ్డ  సిద్దరామయ్య సర్కార్ తమ ఖజానా నింపుకొనేందుకు  ఈ బిల్లును ఆమోదించిందని ఆయన విమర్శించారు.

ఈ బిల్లులో పేర్కొన్న మేరకు  కోటి రూపాయాలకు పైగా ఆదాయం వచ్చే దేవాలయాల్లో పది శాతం ప్రభుత్వం సేకరించనుంది.  ఆలయాల అభివృద్ది కోసం భక్తులు సమర్పించే కానుకలు, నిధులను దేవాలయాల అభివృద్దికి కేటాయించాలని ఆయన కోరారు. 

ఈ బిల్లుపై బీజేపీ విమర్శలపై  కర్ణాటక మంత్రి  రామలింగారెడ్డి స్పందించారు.  మత రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి హిందూ ప్రయోజనాలను, దేవాలయాలను కాంగ్రెస్ పరిరక్షిస్తుందని  ఆయన పేర్కొన్నారు.

హిందూ వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పుకోవడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు  బీజేపీ ప్రయత్నిస్తుందని  రామలింగారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరంతరం  దేవాలయాలను కాపాడుతున్నాయన్నారు. 

 

click me!