వీడేరా నాయకుడంటే.. జ్వరం వచ్చిన వ్యక్తిని దూరంపెట్టిన వూరు: బైక్‌పై ఆసుపత్రికి

By Siva KodatiFirst Published Aug 13, 2020, 3:08 PM IST
Highlights

నాయకుడు అంటే ప్రజలు కష్టాలను తన కష్టంగా భావించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన విధిని నిర్వహించాలి. అలాంటి నిజమైన నాయకుల్ని సినిమాలో చూసుంటాం.. నిజ జీవితంలో కనిపించడం కష్టమే. 

నాయకుడు అంటే ప్రజలు కష్టాలను తన కష్టంగా భావించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన విధిని నిర్వహించాలి. అలాంటి నిజమైన నాయకుల్ని సినిమాలో చూసుంటాం.. నిజ జీవితంలో కనిపించడం కష్టమే.

అయితే కొందరు మాత్రం తమ నాయకత్వ లక్షణాలతో మంచి నేతలు ఇంకా ఉన్నారని రుజువు చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తికి జ్వరం వస్తే అది కరోనా వైరస్ ముందు వచ్చే ఫీవర్ అయి ఉంటుందని భావించి అందరూ భయంతో అతడిని దూరం పెట్టారు.

దీంతో అతని కష్టం గురించి తెలుసుకున్న ఓ యువనాయకుడు వెంటనే అతనిని బైక్‌పై ఎక్కించుకుని మరి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జార్ గ్రామ్ జిల్లా సిజు గ్రామానికి చెందిన అమల్ బారిక్ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట ఇక్కడికి వచ్చాడు.

ఈ క్రమంలో అతనికి జ్వరం వచ్చింది. కరోనా నేపథ్యంలో అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు అంబులెన్స్ రాలేదు. అతని బాధను తెలుసుకున్న పక్కవూరికి చెందిన గోపీబల్లబ్‌పూర్‌లోని సత్యకామ్ పట్నాయక్ వెంటనే తెలిసిన వారి వద్ద ఓ బైక్ అడిగి తీసుకున్నాడు.

వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి అక్కడ పీపీఈ కిట్ కొనుగోలు చేశాడు. వైట్ అండ్ వైట్ పీపీఈ కిట్ ధరించి అమల్ బారిక్ నివాసానికి వెళ్లాడు. అతడిని బండి మీద ఎక్కించుకుని 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో వున్న ఆసుపత్రిలో చేర్చాడు.

అతడు తీసుకెళ్లింది తక్కువ దూరమే కావొచ్చని.. కానీ అతడు చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. సత్యకామ్ పట్నాయక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టికి చెందిన వ్యక్తి. 

click me!