
ఆమడ దూరంలో పాము కనిపిస్తేనే భయంతో వణికిపోతాం. అమాంతం అక్కడి బయటకు పరుగులు తీస్తాం. అలాంటిది అతి పెద్ద పాము.. అందులోనూ విషపూరితమైనది ఇంట్లోకి వస్తే.. ఇంకేమైనా ఉందా..? ఇలాంటి సంఘటనే ఓ కుటుంబానికి ఎదురైంది. కాగా.. ఆ ఇంట్లో కి వచ్చిన పాముని చాకచక్యంగా బంధించగా.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని టేబుల్ కింద పాము నక్కి ఉండటం గమనార్హం. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు దానిని బంధించారు. ఈ క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
కాగా.. ఆ వీడియోలో పాముని పట్టుకునేందుకు ఓ వ్యక్తి టేబుల్ కిందకు దూరాడు. అనంతరం దానిని పట్టుకొని ఇంటి టెర్రపైన ఉన్న సంచిలో వేశాడు. ఈ క్రమంలో పాము అతని మెడను కూడా చుట్టుకుంది. వీడియో చూస్తే ఒళ్లు జలదరించకమానదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. పామును సంచిలో నుంచి బయటకు వదిలినప్పుడు అది అడవిలోకి వెళ్లడం కూడా చూపించారు. ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కంటే కింగ్ కోబ్రా చాలా విషపూరితమైనది.