
కోల్ కతా : west bengal రాష్ట్రంలో ఒకేరోజు ఇద్దరు councillors దారుణ murderకు గురవడం కలకలం రేపింది. ఇందులో ఒకరిని దుండగుడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చివేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆదివారం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రెండు హత్యలు చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతి మున్సిపాలిటీకి చెందిన టీఎంసీ కౌన్సిలర్ అనుపమ్ దత్తా ఆదివారం హత్యకు గురయ్యారు.
నిన్న సాయంత్రం అగర్ పరా ప్రాంతంలో Anupam Dutta ఓ దుకాణం నుంచి బయటకు వచ్చి స్కూటీపై కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు అనుపమ్ తకు తుపాకీ పెట్టి కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనుపమ్ ను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ద్వారా నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు కాంట్రాక్ట్ కిల్లర్ అని సమాచారం. కాగా ఈ ఘటనకు కొన్ని గంటల ముందే purulia ప్రాంతంలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కుందును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తపన్ కుందు తన ఇంటికి సమీపంలో వాకింగ్ చేస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తపన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఇద్దరి హత్యలకు సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, పంజాబ్ లోని జలంధర్ లో దారుణం జరిగింది. దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచంలో చాంపియన్ గా నిలిచిన.. అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, ఇండియన్ స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం జలంధర్‌లోని మల్లియన్ ఖుర్ద్ (నివిన్ మల్లియన్)లో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్ పాల్గొనేందుకు సందీప్ తన బృందంతో కలిసి వచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. బులెట్లు సందీప్ తల, ఛాతీ నుంచి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ఆయన మృతి చెందాడు.
ఈ విషయం తెలియగానే.. ఘటన స్థలానికి జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ చేరుకున్నారు. కాల్పుల ఘటనను పరిశీలించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో మరో యువకుడి కూడా గాయపడ్డారు. సరైన సమయంలో చిక్సిత అందించడం వల్ల అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల ముసుగులో ఉన్న సుమారు 15 మంది గూండాలు సందీప్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక, పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం రాగానే.. ఈ ఘటన జరగడం పట్ల కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.