Cylinder blast news: ఉలిక్కిప‌డ్డ జ‌మ్ము.. సిలిండర్ పేలి.. న‌లుగురు మృతి..

Published : Mar 15, 2022, 05:25 AM IST
Cylinder blast news: ఉలిక్కిప‌డ్డ జ‌మ్ము.. సిలిండర్ పేలి.. న‌లుగురు మృతి..

సారాంశం

Cylinder blast news: జమ్ములో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో నలుగురు మృతిజమ్ముకశ్మీర్​లో సిలిండర్​ పేలి నలుగురు చనిపోగా... మరో 11 మందికి గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జమ్ములోని రెసిడెన్సీ రోడ్​ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.ఒక్కసారిగా పేలుడు సంభవించడం కారణంగా స్థానికులు భయాందోళనకు గుర్యయారు.   

Cylinder blast in Jammu : జమ్ముకశ్మీర్​లో సోమవారం సాయంత్రం ఘోర‌ అగ్నిప్రమాదం జ‌రిగింది.. జమ్ము రెసిడెన్సీ రోడ్డులోని ఓ వ్యర్థాల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్ర‌మంగా ఆ మంట‌లు  పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే షాపులోని ఉన్న‌ గ్యాస్​ సిలిండర్​ ఓసారిగా  పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆ ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరినట్టు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.


ఘటన జరిగినప్పుడు భారీ పేలుడు శబ్దాలతో పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షాట్​ సర్క్యూట్​ వ‌ల్లే ఈ ప్ర‌మాదం  జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 

ఈ ఘటనలో ఓ చిన్నారి సహా నలుగురు చనిపోగా..15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ బిల్డింగ్ లో నివసిస్తున్నవారిలో చాలామంది అసోం రాష్ట్రానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1లక్ష, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ. 25వేలు ఇస్తామని హామీనిచ్చారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?