Kabaddi Player Sandeep: అంత‌ర్జాతీయ స్టార్ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మ్యాచ్‌ జరుగుతుండగానే కాల్పులు

Published : Mar 15, 2022, 06:01 AM IST
Kabaddi Player Sandeep: అంత‌ర్జాతీయ స్టార్ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య.. మ్యాచ్‌ జరుగుతుండగానే కాల్పులు

సారాంశం

Kabaddi Player Sandeep: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్‌ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు.  

Kabaddi Player Sandeep: పంజాబ్ లోని జలంధర్ దారుణం జరిగింది. దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచంలో చాంపియ‌న్ గా నిలిచిన‌.. అంతర్జాతీయ కబడ్డీ ఆట‌గాడు, ఇండియ‌న్ స్టార్‌ రైడర్‌ సందీప్ నంగల్‌ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం జలంధర్‌లోని మల్లియన్ ఖుర్ద్ (నివిన్ మల్లియన్)లో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్ పాల్గొనేందుకు సందీప్ తన బృందంతో కలిసి వచ్చాడు. ఈ స‌మయంలో గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్టు తెలుస్తుంది. బులెట్లు  సందీప్‌ తల, ఛాతీ నుంచి దూసుకెళ్లడంతో అక్క‌డిక్క‌డే ఆయ‌న మృతి చెందాడు.

ఈ విష‌యం తెలియ‌గానే.. ఘ‌ట‌న స్థ‌లానికి జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ చేరుకున్నారు. కాల్పుల ఘ‌ట‌న‌ను పరిశీలించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో యువ‌కుడి కూడా గాయ‌ప‌డ్డారు. స‌రైన స‌మ‌యంలో చిక్సిత అందించ‌డం వ‌ల్ల అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

సందీప్ ప్రపంచంలోని టాప్ 5  కబడ్డీ ప్లేయర్లలో ఒకడు, మేజర్ కబడ్డీ లీగ్ ఫెడరేషన్ అధినేత. అతను వివిధ కబడ్డీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో యునైటెడ్ కింగ్‌డమ్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించాడు. సందీప్‌కు భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సందీప్‌ ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి. కబడ్డీ ఆటలో అథ్లెటిక్ ప్రతిభ, నైపుణ్యం కారణంగా అతన్ని కొన్నిసార్లు డైమండ్ ప్లేయర్ అని పిలుస్తారు. సందీప్‌కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను UK లో నివసిస్తున్నాడు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో కబడ్డీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి భారతదేశానికి వస్తాడు.  

 ఈ సంఘటన తర్వాత ప్రాంతంలోని ప్రజలు షాక్ గుర‌య్యారు. భయాందోళనలతో ఘ‌ట‌న స్థ‌లం నుంచి పారిపోయారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల ముసుగులో ఉన్న సుమారు 15 మంది గూండాలు సందీప్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక, పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం రాగానే.. ఈ ఘటన జరగడం పట్ల కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ఆప్ ప్రభుత్వంలో కచ్చితంగా శాంత్రి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని కామెంట్లు పెడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?