త్రివర్ణ పతాకం భారతదేశ ఐక్యత, సమగ్రత, భిన్నత్వానికి చిహ్నం: ప్రధాని మోడీ

By Mahesh RajamoniFirst Published Aug 11, 2022, 11:50 AM IST
Highlights

PM Modi: సూరత్‌లో జరిగిన తిరంగా ర్యాలీని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని న‌రేంద్ర మోడీ కొద్ది రోజుల్లోనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు.  మన త్రివర్ణ పతాకం భారతదేశ ఐక్యత, భారతదేశ సమగ్రత, భారతదేశ భిన్నత్వానికి ప్రతీక అని కూడా ఆయన పేర్కొన్నారు.

75 years of independence: భారత జాతీయ జెండాలో మూడు రంగులు మాత్రమే ఉండవని, ఇది మన integrity, వర్తమానం పట్ల మన నిబద్ధత, భవిష్యత్తు గురించి మన కలల ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సూరత్‌లో జరిగిన తిరంగా ర్యాలీని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని మోడీ కొద్ది రోజుల్లోనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నాయని గుర్తు చేశారు. భారతదేశం నలుమూలలా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నందున మనమందరం ఈ చారిత్రాత్మక స్వాతంత్య్ర‌ దినోత్సవానికి సిద్ధమవుతున్నామని అన్నారు. గుజరాత్‌లోని ప్రతి మూల కూడా ఉత్సాహంతో నిండిపోయిందని, సూరత్ దాని కీర్తిని మరింత పెంచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

దేశం మొత్తం దృష్టి నేడు సూరత్‌పైనే ఉందని.. సూరత్‌ తిరంగ యాత్రలో ఓ విధంగా మినీ ఇండియా కనిపిస్తోందని.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఇందులో పాలుపంచుకుంటున్నారని అన్నారు. త్రివర్ణ పతాకం నిజమైన ఏకీకరణ శక్తిని సూరత్ చూపించిందని ప్రధాని మోడీ అన్నారు. సూరత్ తన వ్యాపారం, పరిశ్రమల కారణంగా ప్రపంచంపై ఒక ప్ర‌త్యేక‌ ముద్ర వేసినప్పటికీ, ఈ రోజు తిరంగా యాత్ర ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరిస్తుందని పేర్కొన్నారు.  తిరంగా యాత్ర‌లో మ‌న స్వాతంత్య్ర‌ పోరాట స్ఫూర్తిని స‌జీవంగా చూపిన సూర‌త్ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. "ఒక బట్టల అమ్మేవాడు, దుకాణదారుడు, ఎవరో మగ్గాల హస్తకళాకారుడు, ఎవరైనా కుట్టు-ఎంబ్రాయిడరీ కళాకారులు, మరొకరు రవాణాలో ఉన్నారు, వారందరూ దీంతో కనెక్ట్ అయ్యారు" అని చెప్పారు. దీన్ని గొప్ప కార్యక్రమంగా మార్చిన సూరత్‌లోని మొత్తం వస్త్ర పరిశ్రమ కృషిని మోడీ అభినందించారు.

“మన జాతీయ జెండా దేశపు వస్త్ర పరిశ్రమ, దేశ ఖాదీ, మన స్వావలంబనకు చిహ్నంగా ఉంది” అని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ రంగంలో స్వావలంబన భారత్‌కు సూరత్ ఎల్లప్పుడూ పునాదిని సిద్ధం చేసిందని ఆయన అన్నారు. బాపు (మ‌హాత్మా గాంధీ) రూపంలో స్వాతంత్య్ర పోరాటానికి గుజరాత్ నాయకత్వం వహించిందని, స్వాతంత్య్రానంతరం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కు పునాది వేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ వంటి వీరులను అందించిందని ప్రధాని అన్నారు. బార్డోలీ ఉద్యమం, దండి యాత్ర నుండి వెలువడిన సందేశం యావత్ దేశాన్ని ఏకం చేసిందని తెలిపారు. "భారత త్రివర్ణ పతాకం మూడు రంగులను మాత్రమే కలిగి ఉండదు.. వర్తమానం పట్ల మన నిబద్ధత, భవిష్యత్తు గురించి మన కలల ప్రతిబింబం" అని ప్రధాని మోడీ అన్నారు. మన త్రివర్ణ పతాకం భారతదేశ ఐక్యత, భారతదేశ సమగ్రత, భారతదేశ భిన్నత్వానికి ప్రతీక అని కూడా ఆయన పేర్కొన్నారు.

‘‘మన యోధులు దేశ భవిష్యత్తును త్రివర్ణ పతాకంలో చూశారు. దేశ కలలను చూశారు. ఏ రకంగానూ తలవంచనివ్వరు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత మనం నవ భారత యాత్రను ప్రారంభిస్తున్నప్పుడు, త్రివర్ణ పతాకం ఒకప్పుడు మళ్లీ భారతదేశం ఐక్యత.. చైతన్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది" అని ప్ర‌ధాని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న తిరంగా యాత్రలు హర్ ఘర్ తిరంగా అభియాన్ శక్తి, భక్తికి ప్రతిబింబం అని సంతోషం వ్యక్తం చేశారు. "ఆగస్టు 13 నుండి 15 వరకు, భారతదేశంలోని ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగురవేయబడుతుంది. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు, ప్రతి కుల-మతానికి చెందిన వ్యక్తులు ఆకస్మికంగా ఒకే గుర్తింపుతో చేరుతున్నారు. ఇది భారత మనస్సాక్షి కలిగిన పౌరుడి గుర్తింపు" అని అన్నారు. ఇది భారతమాత బిడ్డకు గుర్తింపు అని ప్రధాని ఉద్ఘాటించారు.

click me!